అప్‌గ్రేడెడ్ టోరెగ్ ఎస్‌యూవీని విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్
జర్మనీకు చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా త్వరలో అప్‌గ్రేడెడ్ టోరెగ్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీ బుధవారం తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ లగ్జరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధర రూ.58.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్‌లో శక్తివంతమైన 3.0 లీటర్, వి6 టిడిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 241 హార్స్ పవర్‌ల శక్తిని, 56.08 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది. కొత్త టోరెగ్ లీటర్ డీజిల్‌కు 12.08 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. పాత టోరెగ్‌తో పోల్చుకుంటే కొత్త టోరెగ్ 41 మి.మీ. ఎక్కువ పొడవును, 12 మి.మీ. ఎక్కువ వెడల్పను కలిగి ఉంటుంది.

అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ - ధర
భారత మార్కెట్లో కొత్త టోరెగ్ ధర రూ.58.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ - ఇంజన్
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్‌లో శక్తివంతమైన 3.0 లీటర్, వి6 టిడిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 241 హార్స్ పవర్‌ల శక్తిని, 56.08 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది.

అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ - మైలేజ్
కొత్త టోరెగ్ లీటర్ డీజిల్‌కు 12.08 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

అప్‌గ్రెడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ - ఇంటీరియర్స్
ఇందులో డ్యాష్‌బోర్డ్‌పై రియర్ వ్యూ కెమెరా, టచ్ స్క్రీన్ ఆప్షన్‌తో కూడిన మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, యాంత్రికంగా నియంత్రచబడే పవర్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, ఎక్కువ బూట్ స్పేస్ కోసం మడిచిపెట్టే వీలున్న వెనుక సీట్లు, రాత్రివేళల్లో స్పష్టమైన కాంతినిచ్చే ఆటోమేటిక్ బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు.

అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ - సేఫ్టీ
డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబిఎస్ వంటి భద్రతా ఫీచర్లు కొత్త టోరెగ్ సొంతం. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే కొత్త ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ 5-సీటర్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది.

అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ - కాంపిటీషన్
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్-క్లాస్ (రూ.56.9 లక్షలు), బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 (రూ.63.8 లక్షలు) వంటి లగ్జరీ కార్లతో పోటీ పడనుంది.
అంతేకాకుండా, పాత టోరెగ్ కన్నా కొత్త టోరెగ్ 200 కేజీల తక్కువ బరువును కలిగి ఉండి, మంచి ఇంటీరియర్ స్పేస్‌ను అందిస్తుంది. ఇందులో డ్యాష్‌బోర్డ్‌పై రియర్ వ్యూ కెమెరా, టచ్ స్క్రీన్ ఆప్షన్‌తో కూడిన మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, యాంత్రికంగా నియంత్రచబడే పవర్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, ఎక్కువ బూట్ స్పేస్ కోసం మడిచిపెట్టే వీలున్న వెనుక సీట్లు, రాత్రివేళల్లో స్పష్టమైన కాంతినిచ్చే ఆటోమేటిక్ బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు.
డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబిఎస్ వంటి భద్రతా ఫీచర్లు కొత్త టోరెగ్ సొంతం. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే కొత్త ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ 5-సీటర్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్-క్లాస్ (రూ.56.9 లక్షలు), బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 (రూ.63.8 లక్షలు) వంటి లగ్జరీ కార్లతో పోటీ పడనుంది. భారత మార్కెట్లో కొత్త టోరెగ్ ధర రూ.58.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








