కొత్త మహీంద్రా వెరిటోలో కొత్తగా చేసిన మార్పులు ఏంటి?
కొత్త మహీంద్రా వెరిటో ఎక్స్టీరియర్ మార్పులు:
* క్రోమ్ ప్లేటెడ్ ఫ్రంట్ గ్రిల్
* సరికొత్త ఫ్రంట్ బంపర్
* కొత్త హెడ్‌లైట్స్
* కొత్త స్టయిలిష్ ఫాగ్ ల్యాంప్స్
* క్లాసీ లుక్ కలిగిన సరికొత్త అల్లాయ్ వీల్స్
* స్టయిలిష్ రూఫ్ రెయిల్స్, కొత్త డిజైన్ కలిగిన పిల్లర్స్
* క్లియర్ లెన్స్ కలిగిన టెయిల్ ల్యాంప్స్
* సరికొత్త బూట్ లిడ్
* ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్స్‌తో కూడిన సరికొత్త రియర్ బంపర్
కొత్త మహీంద్రా వెరిటో ఇంటీరియర్ మార్పులు:
* రెండు రంగుల కలయికతో కూడిన డ్యాష్‌బోర్డ్ ప్యానెల్
* సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్
* సైడ్ మిర్రర్లను యాంత్రికంగా నియంత్రించేందుకు డ్యాష్ బోర్డ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్స్
* డ్రైవర్ వైపు డోర్‌పై ఏర్పాటు చేసిన పవర్ విండో స్విచ్‌లు
* సరికొత్త ఏసి కంట్రోల్స్
కొత్త మహీంద్రా వెరిటో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 75 హెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 510 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉండి దూర ప్రయాణాలకు అణువుగా ఉంటుంది.
హైదరాబాద్ మార్కెట్లో లభించే మహీంద్రా వెరిటో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
Petrol Version:
* Mahindra Verito BS3 1.4 G2 - INR 5,15,416
* Mahindra Verito BS3 1.4 G4 - INR 5,43,019
* Mahindra Verito BS4 1.4 G2 - INR 5,21,406
* Mahindra Verito BS4 1.4 G4 - INR 5,43,275
Diesel Version:
* Mahindra Verito BS3 1.5 D2 - INR 5,99,363
* Mahindra Verito BS3 1.5 D4 - INR 6,32,067
* Mahindra Verito BS3 1.5 D6 - INR 6,99,123
* Mahindra Verito BS4 1.5 D2 - INR 6,19,758
* Mahindra Verito BS4 1.5 D4 - INR 6,41,584
* Mahindra Verito BS4 1.5 D6 - INR 7,08,639
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications









