నిస్సాన్ ఇవాలియాలో ఉండే ప్రత్యేకమై ఫీచర్లు ఏంటి?

నిస్సాన్ ఇవాలియాలో సౌకర్యానికి కొరతే లేదు:
ఇందులో హీటర్‌తో కూడిన మ్యాన్యువల్ ఎయిర్ కండిషనర్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి వేరియంట్లలో వెనుక ప్యాసింజర్లకు సైతం ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్, టాప్ ఎండ్ వేరియంట్ (ఎక్స్‌వి)లో రియర్ వ్యూ కెమెరా, ఏఎమ్, ఎఫ్ఎమ్, సిడి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, 4 స్పీకర్లు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, టిల్ట్ అడ్జస్టబల్ పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లున్నాయి.

అంతేకాకుండా.. ముందు వైపు డోర్లకు పవర్ విండోస్, వెనుక వైపు సీట్లలో కూర్చునే ప్యాసింజర్ల సౌకర్యం కోసం ముందు సీట్లకు వెనుక భాగంలో అమర్చిన ఫోల్డబల్ ప్లాస్టిక్ టేబుల్స్, డ్రైవర్ ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉన్న సీట్, రెండవ వరుసులో విడివిడిగా మడుచుకునేందుకు వీలున్న స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్స్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు కూడా నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి సొంతం.

టెక్నాలజీలోనూ సూపరో సూపరు..
ట్రిప్ కంప్యూటర్, ప్రయాణించే వేగాన్ని తెలిపే క్రూయిజ్ రేంజ్, మైలేజ్‌ను తెలిపే రియల్ టైమ్ ఫ్యూయెల్ మైలేజ్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్, టాకోమీటర్ మొదలైన ఫీచర్లతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్‌టాప్స్ వంటి గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన 12 వోల్ట్ పవర్ సాకెట్, కారు బాడీ రంగులో ఉండే బంపర్స్ మరియు సైడ్ మిర్రర్స్, వెనుక సీట్లలోకి ప్రయాణికులు సులువుగా ప్రవేశించేందుకు, కారులో నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్లైడింగ్ డోర్స్, యాంత్రికంగా నియంత్రించబడే సైడ్ మిర్రర్స్, టాప్ ఎండ్ వేరియంట్లో ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇన్ని ప్రత్యేకమైన విశష్టమైన ఫీచర్లు కలిగిన నిస్సాన్ ఇవాలియా నాలుగు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి) లభ్యమవుతుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. ధర, ఫీచర్లను పరిగణిలోకి తీసుకుంటే, ఎమ్‌పివి సెగ్మెంట్లో 'ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇవాలియా ఈజ్ బెస్ట్' అని చెప్పవచ్చు. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, August 16, 2012, 19:55 [IST]
English summary
Japanese carmaker Nissan India is all set for official launch of its first MPV Evalia in September. Nissan Evalia is powered by 1.5 litre dCi CRDI Diesel engine which generates peak power of just 85 BHP, but the 200 Nm torque. Here is the full list of Evalia specifications and features. Have a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+