అప్‌గ్రేడెడ్ కాప్టివాలో అప్‌గ్రేడ్స్ ఏంటి?: చిత్రాలతో కూడిన సమీక్ష
అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ దేశీయ విపణిలో చెవర్లే బ్లాండ్ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'కాప్టివా'లో గడచిన జూన్ నెలాఖరులో కంపెనీ ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కంపెనీ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాత వెర్షన్ చెవర్లే కాప్టివాతో పోల్చుకుంటే కొత్త 2012 చెవర్లే కాప్టివాలో డిజైన్, స్టయిల్ పరగంగా కొద్దిపాటి మార్పులు ఉన్నాయి.
ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి ముందువైపు కనిపించే డిజైన్, స్పష్టమైన లెన్స్ కలిగిన ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద గ్రిల్, ఎయిర్ డ్యామ్స్ మొదలైనవి. కొత్త కాప్టివాలో ఉపయోగించిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీ మంచి స్టయిలిష్ లుక్‌నివ్వటమే కాకుండా, ఆఫ్-రోడింగ్‌లో మంచి రోడ్ గ్రిప్‌ను కూడా కలిగి ఉంటాయి. విశిష్టమైన ఫీచర్లు కలిగిన ఈ ప్రీమియం ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.18.74 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే.

చెవర్లే కాప్టివా ఫ్రంట్ లుక్
* విసిడిఐ డీజిల్ ఇంజన్ 150 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ చార్క్
* సరికొత్త ఫ్రంట్ గ్రిల్
* కొత్త హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్

కొత్త చెవర్లే కాప్టివా ఫీచర్లు
* ఎస్‌యూవీ సైడ్ బాడీ ప్రొఫైల్‌లో కొద్దిపాటి మార్పు
* సైడ్ మిర్రర్స్‌పై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్
* 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్

చెవర్లే కాప్టివా ఎక్స్‌ట్రీమ్ వేరియంట్
* స్టయిలిష్ సన్‌రూఫ్
* స్టీరింగ్ వీల్‌పై బ్లూటూత్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కంట్రోల్స్
* వాహనం నడిపే రోడ్డును బట్టి ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకునే సస్పెన్షన్

చెవర్లే కాప్టివా ఇంటీరియర్స్
* బ్లాక్, రెడ్ కలయికతో కూడిన సీట్లు
* క్రూయిజ్ కంట్రోల్
* హిల్ డిసెంట్ కంట్రోల్
* రెండు వరుసలలో హీటింగ్, వెంటిలేషన్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్

చెవర్లే కాప్టివా డ్యాష్‌బోర్డ్
* సెంట్రల్ కన్సోల్‌లో కంట్రోల్స్ స్థానాలలో మార్పు
* కొత్త డ్యాష్‌బోర్డ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* మెరుగైన ప్లాస్టిక్ నాణ్యత
* ఫోన్లు, ఐపాడ్ వంటి మల్టీమీడియా డివైజ్‌లను సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
* ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
* వర్షం పడటాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేసే రెయిన్-సెన్స్ వైపర్స్

చెవర్లే కాప్టివా హైలైట్స్
* ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్
* ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
* ఆరు ఎయిర్ బ్యాగ్స్
* ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
* ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)
* ముందు వైపు, వెనుక వైపు ఫాగ్‌ల్యాంప్స్
* ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పాజెరో, ఫోర్డ్ ఎండీవర్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు ధీటుగా తీర్చిదిద్దిన కొత్త 2012 చెవర్లే కాప్టివాలో శక్తివంతమైన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 3800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 150 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో పాటుగా 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో కూడా లభ్యమవుతుంది.
కొత్త 2012 చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ 1565 లీటర్ల బూట్ స్పేస్ విశాలమైన స్టోరేజ్ సదుపాయాన్ని అందిస్తుంది. అంతేకాదు అవసరం లేదనుకున్నప్పుడు వెనుక సీటును మడిచి పెట్టి లగేజ్ స్పేస్ కోసం వాడుకునే సౌలభ్యం కూడా 2012 వెర్షన్ చెవర్లే కాప్టిలో ఉంది. ఇది మూడు విభిన్న వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. రాష్ట్ర మార్కెట్లో దీని ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
హైదరాబాద్ మార్కెట్లో చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ ధరలు:
* చెవర్లే కాప్టివా ఎల్‌టి బిఎస్4 - రూ. 19,07,378
* చెవర్లే కాప్టివా ఎక్స్‌ట్రీమ్ బిఎస్4 - రూ. 19,82,984
* చెవర్లే కాప్టివా ఆల్-వీల్ డ్రైవ్ బిఎస్4 - రూ. 20,95,746
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








