కొత్త మహీంద్రా వెరిటోలో సరికొత్తగా..: చిత్రాలతో కూడిన సమీక్ష

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుంచి లభిస్తున్న ఏకైక సెడాన్ వెరిటోలో కంపెనీ తాజాగా సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పాత వెర్షన్ వెరిటోతో పోల్చుకుంటే అనేక మార్పుల చేర్పులను కొత్త వెరిటోలో చేయబడ్డాయి. ఒకప్పుడు (ఈ మోడల్ లోగాన్ పేరుతో అమ్మడవుతున్నప్పుడు) వెరిటోను ఎక్కువగా టాక్సీ, క్యాబ్ సర్వీస్ వంటి కమర్షియల్ ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించే వారు.

అయితే, మహీంద్రా ఈ కారుకు కొత్త లుక్‌నిచ్చి తొలిసారి అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో గడచిన ఏప్రిల్ నెలలో విడుదల చేసిన తర్వాత దీనిని పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ కోసం కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వెరిటోలో మరింత స్టయిలిష్, కంఫర్టబల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో న్యూ లుక్ వెరిటో లభ్యమవుతోంది. సరసమైన ధర, సలక్షణమైన ఫీచర్లు, సరికొత్త లుక్, సౌకర్యవంతమైన సదుపాయాలతో కొత్త వెరిటోను తీర్చిదిద్దారు.

ఈ కొత్త 2012 వెర్షన్ మహీంద్రా వెరిటోలో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు క్రింది ఫోటోలలో గమనించవచ్చు.

ముందు వైపు డిజైన్ మార్పులు

ముందు వైపు డిజైన్ మార్పులు

* క్రోమ్ ప్లేటెడ్ ఫ్రంట్ గ్రిల్

* సరికొత్త ఫ్రంట్ బంపర్

* కొత్త హెడ్‌లైట్స్

* కొత్త స్టయిలిష్ ఫాగ్ ల్యాంప్స్

వెనుక వైపు డిజైన్ మార్పులు

వెనుక వైపు డిజైన్ మార్పులు

* క్లాసీ లుక్ కలిగిన సరికొత్త అల్లాయ్ వీల్స్

* స్టయిలిష్ రూఫ్‌ రెయిల్స్, కొత్త డిజైన్ కలిగిన పిల్లర్స్

* క్లియర్ లెన్స్ కలిగిన టెయిల్ ల్యాంప్స్

* సరికొత్త బూట్ లిడ్

* ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్స్‌తో కూడిన సరికొత్త రియర్ బంపర్

ఇంటీరియర్ స్పేస్

ఇంటీరియర్ స్పేస్

కొత్త మహీంద్రా వెరిటో విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఫ్రంట్ అండ్ రియర్ సీట్లలోని ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన సీటింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

బూట్ స్పేస్ (లగేజ్ స్థలం)

బూట్ స్పేస్ (లగేజ్ స్థలం)

సరికొత్త మహీంద్రా వెరిటో 510 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి మంచి లగేజ్ స్థలాన్ని ఆఫర్ చేస్తుంది. అధిక లగేజ్‌తో ఎక్కువ దూరం ప్రయాణాలు చేసేవారికి కొత్త వెరిటో సరికొత్త అనుభూతులను మిగుల్చుతుంది.

డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్

డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్

* రెండు రంగుల కలయికతో కూడిన డ్యాష్‌బోర్డ్ ప్యానెల్

ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్

ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్

* సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్

* సరికొత్త ఏసి కంట్రోల్స్

ఆల్ పవర్ విండోస్

ఆల్ పవర్ విండోస్

* డ్రైవర్ వైపు డోర్‌పై ఏర్పాటు చేసిన పవర్ విండో స్విచ్‌లు

ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్ కంట్రోల్స్

ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్ కంట్రోల్స్

* సైడ్ మిర్రర్లను యాంత్రికంగా నియంత్రించేందుకు డ్యాష్ బోర్డ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్స్


కొత్త మహీంద్రా వెరిటో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌ వెరిటోలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 75 హెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 510 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉండి దూర ప్రయాణాలకు అణువుగా ఉంటుంది.

హైదరాబాద్ మార్కెట్లో లభించే మహీంద్రా వెరిటో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

పెట్రోల్ వెర్షన్:
* మహీంద్రా వెరిటో బిఎస్3 1.4 జి2 - రూ.5,15,416
* మహీంద్రా వెరిటో బిఎస్3 1.4 జి4 - రూ.5,43,019
* మహీంద్రా వెరిటో బిఎస్4 1.4 జి2 - రూ.5,21,406
* మహీంద్రా వెరిటో బిఎస్4 1.4 జి4 - రూ.5,43,275

డీజిల్ వెర్షన్:
* మహీంద్రా వెరిటో బిఎస్3 1.5 డి2 - రూ.5,99,363
* మహీంద్రా వెరిటో బిఎస్3 1.5 డి4 - రూ.6,32,067
* మహీంద్రా వెరిటో బిఎస్3 1.5 డి6 - రూ.6,99,123
* మహీంద్రా వెరిటో బిఎస్4 1.5 డి2 - రూ.6,19,758
* మహీంద్రా వెరిటో బిఎస్4 1.5 డి4 - రూ.6,41,584
* మహీంద్రా వెరిటో బిఎస్4 1.5 డి6 - రూ.7,08,639

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Tuesday, September 11, 2012, 19:28 [IST]
English summary
The new Mahindra Verito is here. Mahindra's first and only sedan, the Verito has received a much needed facelift today. The company has unveiled the refreshed new Mahindra Verito in Delhi with a starting price of Rs.5.27 lakhs for the base variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+