టాటా జెనాన్ పికప్ ట్రక్‌లో కొత్త ఫీచర్లు ఏమిటి?

టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన టాటా జెనాన్ పికప్ ట్రక్ ఈ శ్రేణిలో కల్లా ఉత్తమ మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. రెండు విభిన్న రూపాలు, ఇంజన్ పవర్‌లతో ఇది లభిస్తుంది. టాటా జెనాన్ సింగిల్ క్యాబిన్ పికప్ 73 హెచ్‌పిల శక్తిని, టాటా జెనాన్ డబుల్ క్యాబిన్ పికప్ 115 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. టాటా జెనాన్‌లోని ఇంజన్లు వాటి ఫ్లాట్ టార్క్ గుణాలు, ఓవర్‌డ్రైవ్ గేర్‌బాక్స్, రేడియల్ టైర్స్, ఏరోడైనమిక్ షేప్‌ల కారణంగా మెరుగైన మైలేజీని సాధించవచ్చని కంపెనీ తెలిపింది.

టాటా జెనాన్ 3 లక్షల కిలోమీటర్లు లేదా 3 ఏళ్ల వారంటీ (ఏది ముందుగా ముగిస్తే అది)తో లభిస్తుంది. సింగిల్ క్యాబ్ వేరియంట్ ఈ శ్రేణిలో కెల్లా పొడవాటి బాడీని కలిగి ఉండి ఎక్కువ లోడింగ్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి లోడ్ క్యారీయింగ్, బెటర్ రైడ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ కోసం ఇందులో వెనుక వైపు మెరుగైన సస్పెన్షన్‌ను అమర్చారు. ఇంకా ఇందులో పవర్, అడ్జస్టబల్ స్టీరింగ్, కుషన్డ్ బకెట్ సీట్స్ వంటి కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.


ఇక డ్యూయెల్ క్యాబ్ వేరియంట్ విషయానికి వస్తే.. ఇందులో హెచ్‌విఏసి, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, లాంబర్ సపోర్ట్‌తో కూడిన సీట్లు వంటి ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో ఇది లభిస్తుంది. గ్రావెల్ లేదా బురద రోడ్లపై టైర్లు జారిపోకుండా ఉండేలా దీనిని తీర్చిద్దారు. సిబ్బంది, మరియు యంత్ర సామాగ్రిని ఒకేసారి తరలించే వారిని దృష్టిలో ఉంచుకొని (ముఖ్యంగా నిర్మాణ రంగం), సౌకర్యవంతంగా, సురశ్రితమైన పద్ధతిలో రవాణా చేసేలా టాటా మోటార్స్ దీనిని తీర్చిదిద్దింది.

ఈ వాహనాన్ని ప్రపంచ స్థాయి సురక్షితా ప్రమాణాలను పాటించేలా డిజైన్ చేశారు. ఇందులో 3-లేయర్డ్ బాడీ నిర్మాణం, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, రీట్రాకబల్ సీట్‌బెల్ట్స్, వాహనం పక్కవైపు నుంచి ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్లను రక్షించేలా డిజైన్ సైడ్ ఇన్‌ట్రుజన్ బీమ్స్ వంటి అధునాత భద్రతా ఫీచర్లో ఇది లభ్యమవుతుంది. టాటా జెనాన్ ఆరిజోనా బ్లూ, మినరల్ రెడ్, ఆర్కిటిక్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

దేశీయ విపణిలో సిగింల్ క్యాబ్ వేరియంట్ టాటా జెనాన్ ధర రూ.5.44 లక్షలుగా ఉండగా, డబుల్ క్యాబ్ జెనాన్ ధర రూ.6.34 లక్షలుగా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం లార్జ్ పికప్ సెగ్మెంట్లో టాటా ఆర్ఎక్స్ పికప్, స్మాల్ పికప్ సెగ్మెంట్లో టాటా సూపర్ ఏస్ వాహనాలను అందిస్తోంది. పికప్ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా విడుదల చేసిన బొలెరో మ్యాక్సీ ట్రక్, మహీంద్రా జెనియో మోడళ్లకు ధీటుకం టాటా మోటార్స్ తమ జెనాన్‌ను ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Monday, September 3, 2012, 16:34 [IST]
English summary
The Tata Xenon Pick-up delivers best-in-class fuel efficiency because of its scientifically engineered drive train. The Tata Xenon's engines, with their flat torque characteristics, the overdrive gearbox, radial tyres and the aerodynamic shape, contribute to its high fuel efficiency.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+