తెలుపు రంగు కార్లకే మంచి మార్కెట్ విలువ

సాధారణంగా మనం కంటి ద్వారా చూసే రంగులు నేరుగా మనస్సుపై ప్రభావాన్ని చూపుతుంటాయి. కొన్ని రంగులు మనస్సుకు ఇంపును కలిగిస్తే మరికొన్ని రంగులు చిరాకును కలిగిస్తాయి. కాబట్టి, మనం ఎంచుకునే వస్తువులను కూడా మన మనస్సుకు నచ్చిన రంగులలోనే ఉండాలనుకుంటాం. ముఖ్యంగా కార్లను కొనుగోలు చేసేటప్పుడు రంగుకే ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఆ షోరూమ్‌లో మనకు నచ్చిన రంగు అందుబాటులో లేనట్లయితే, ఆ మోడల్ కోసం నెలల తరబడి వేచి చూస్తుంటాం.

సరే ఇదంతా అటుంచితే.. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కార్ కలర్‌ను బట్టి రేట్ ఉంటుంది. కార్ల ధరలను అంచనా వేసే అధికారుల ప్రకారం, తెలుపు రంగు కలిగి ఉన్న కార్లు మార్కెట్లో అధిక మార్కెట్ విలువను కలిగి ఉంటున్నాయి. మార్కెట్లో తెలుపు రంగు కార్ల విలువ సాధారణ కార్లతో పోల్చుకుంటే దాదాపు 5 శాతం అధికంగా ఉంటుంది. క్యాప్ (CAP) అంచనా నిపుణల ప్రకారం, బలుగు రంగులు కార్లు తక్కువ మార్కెట్ విలువను కలిగి ఉంటుండగా, తెలుపు రంగు కార్ల ఎక్కువ విలువను కలిగి ఉంటున్నాయి.


గడచిన ఐదేళ్లుగా లక్షలాది వాహనాలపై క్యాప్ ఓ అధ్యయాన్ని నిర్వహించింది. వీటిల్లో తెలుపు రంగు కార్లకే ఉత్తమ మార్కెట్ విలువ ఉన్నట్లు క్యాప్ గుర్తించింది. దీనిపై క్యాప్ ఛీఫ్ ఎడిటర్ క్రిస్ క్రౌ వ్యాఖ్యనిస్తూ.. గడచిన ఐదేళ్లుగా నలుపు, సిల్వర్, గ్రే కలర్ వాహనాలకు స్థిరమైన మార్కెట్ విలువ ఉండగా, ఇందులో తెలుపు రంగుకే 6 శాతం అధిక మార్కెట్ విలువ కలిగి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వాహన విలువ అనేది తెలుపు రంగుతో పాటు, దాని కండిషన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.

ఆకుపచ్చ రంగు కార్లకు పెద్దగా ప్రాచుర్యం లేకపోగా, ఈ వాహనాలను విక్రయించే యజమానలకు అధిక డిప్రిషియేషన్‌ను ఎదుర్కోవలసి వస్తోంది. బులుగు, నారింజ, ఎరుపు రంగు వాహనాలు అలాగే బంగారం, ఆకుపచ్చ, మెరూన్ రంగు వాహనాలను విక్రయించే యజమానులు మార్కెట్ విలువ కన్నా సుమారు 4-6 శాతం మేర తక్కువ విలువను పొందుతున్నట్లు క్యాప్ పేర్కొంది. ఏదేమైనప్పటికీ, మార్కెట్ వ్యాల్యూ సంగతి అటుంచితే తెలుపు రంగు కార్లు మంచి రాయల్, ఎగ్జిక్యూటివ్ లుక్‌ను కలిగి ఉండి, రోడ్డుపై వెళ్లే వారిని దృష్టిని ఇట్టే ఆకట్టుకుంటుంటాయి.

Article Published On: Friday, August 31, 2012, 16:00 [IST]
English summary
According to recent study, white colour cars typically hold about five per cent more of their value than the market average for a typical used cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+