సన్నీలో సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టనున్న నిస్సాన్

నిస్సాన్ అమ్ములపొది నుంచి మరొక బ్రహ్మాస్త్రం వెలువడనుంది. నిస్సాన్ నుంచి విడుదలై ఇప్పటికే మార్కెట్లో బహుళ ప్రజాదరణను సొంతం చేసుకున్న సన్నీ సెడాన్‌లో మరొక కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు నిస్సాన్ ఇండియా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తొలుత పెట్రోల్ వేరియంట్‌లో భారత మార్కెట్లో విడుదల చేసిన నిస్సాన్ సన్నీలో కంపెనీ అనంతరం ఓ డీజిల్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

డీజిల్ వేరియంట్ నిస్సాన్ సన్నీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సరసమైన ధరకే మంచి విశాలమైన, సౌకర్యమైన కారును పొందాలనుకునే వారికి నిస్సాన్ సన్నీ ఎల్లప్పటికీ ఓ చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. మంచి ఇంటీరియర్ స్పేస్, విశాలమైన బూట్ స్పేస్, ప్రీమియం లుక్ అండ్ ఫీల్ కలిగిన నిస్సాన్ సన్నీ మైలేజ్ విషయంలో కూడా ది గ్రేట్ అనిపించుకుంటుంది. పెట్రోల్ వేరియంట్ సన్నీ సుమారు 15 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ సన్నీ 20 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.


కాగా.. తాజాగా మార్కెట్లోకి రానున్న నిస్సాన్ సన్నీ సిఎన్‌జి ఈ రెండింటి కన్నా అధనపు మైలేజీని ఇవ్వనుంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)తో నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ కంపెనీలు కూడా ఈ తరహా మోడళ్లపై దృష్టి సారిస్తున్నాయి. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సిఎన్‌జి వాహనాలు సహకరిస్తాయి.

ఇప్పుడిప్పుడే భారత మార్కెట్లో గుర్తింపును తెచ్చుకుంటున్న నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో అమ్మకాలను పెంచుకునేందుకు కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది. అయితే, ప్రస్తుతం పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గి డీజిల్ కార్ల అమ్మకాలు జోరందుకున్న నేపథ్యంలో పెట్రోల్ సన్నీ సెడాన్ అమ్మకాలను పెంచుకునేందుకు, ఇందులో పెట్రోల్-సిఎన్‌జి డ్యూయెల్ ఫ్యూయెల్ ఆప్షన్ కలిగిన సన్నీని తీసుకువచ్చేందుకు నిస్సాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి ఇదొక చక్కటి ఐడియాగానే చెప్పవచ్చు. నిస్సాన్ సన్నీలో ఉండే విశాలమైన బూట్‌ స్పేస్‌లో ఒక పెద్ద సిఎన్‌జి ట్యాంక్‌ను ఫిట్ చేసినప్పటికీ ఇంకా సుమారు 300 లీటర్ల బూట్ స్పేస్ మిగిలే ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్ సన్నీ సెడాన్ ధర రూ. 5.93 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇందులో సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లయితే దాని ధర సుమారు రూ.6.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండొచ్చని అంచనా. కాగా.. ఈ విషయాన్ని నిస్సాన్ ఇండియా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 3, 2012, 18:55 [IST]
English summary
This might be a good news for Nissan Sunny lovers. According to reports the Japanese car maker is planning to bring Petrol-CNG duel fuel version of its popular sedan Sunny to boost the petrol variant Sunny sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+