సుజుకి ఎస్-క్రాస్: సెడాన్-ఎస్‌యూవీల కాంబినేషన్

By Ravi

జపాన్ ఆటో దిగ్గజం సుజుకి మోటార్ కార్పోరేషన్ ప్రస్తుతం ప్యారిస్‌లో జరుగుతున్న 2012వ అంతర్జాతీయ మోటార్ ప్రదర్శనలో తమ సరికొత్త ఎస్-క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఇది క్రాసోవర్ సెగ్మెంట్లో సుజుకి నుంచి మార్కెట్లోకి రానున్న నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తి. సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ తక్కువ కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తూ, మంచి డ్రైవింగ్ డైనమిక్స్‌ను కలిగి ఉంటుంది. అధిక లగేజ్ స్పేస్, విశాలమైన ఇంటీరియర్స్ వంటి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కాన్సెప్ట్ కారును డిజైన్ చేసింది.

మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, పవర్‌ఫుల్ సి-సెగ్మెంట్ సెడాన్ ఎస్ఎక్స్4, ప్రీమియం సెడాన్ కిజాల నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ను తయారు చేసింది. ఇది మంచి ఆన్-రోడ్ డ్రైవ్ డైనమిక్స్, మైలేజ్, పెర్ఫామెన్స్‌లను ఆఫర్ చేస్తుంది. ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కూడా సుజుకి అభివృద్ధి చేస్తోంది. రోజూవారీ అవసరాలు, వారాంతపు దూర ప్రయాణాలకు అనువుగా సుజుకి తమ ఎస్-క్రాస్ క్రోసోవర్ కాన్సెప్ట్ కారును తీర్చిదిద్దింది.

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - ఫ్రంట్ వ్యూ

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - రియర్ వ్యూ

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - సైడ్ వ్యూ

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - ఫ్రంట్ గ్రిల్

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - ఫాగ్ ల్యాంప్స్

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - టెయిల్ ల్యాంప్స్

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌

సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌ - అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్


ప్రస్తుతం సుజుకి గ్లోబల్ మార్కెట్లలో ఎస్ఎక్స్4 క్రాసోవర్‌ను అందిస్తోంది. కాగా.. భవిష్యత్తులో ఈ నెక్స్ట్ జనరేషన్ ఎస్-క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ ప్రస్తుత ఎస్ఎక్స్4 క్రాసోవర్‌ను రీప్లేస్ చేయవచ్చని సమాచారం. ఇందులో డైనమిక్ లైన్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ ఏరోడైనమిక్ డిజైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌లో ప్రధానంగా చెప్పుకోదగినవి.

ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌లో సుజుకి ప్లష్ ఇంటీరియర్స్‌ను పరిచయం చేసింది. అధునాత సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుజుకి ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది. సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ 2013 ప్రారంభంలో యూరప్ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఇటు సిటీ రైడ్‌కు అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు. అయితే, ఈ సుజుకి ఎస్-క్రాస్ కాన్సెప్ట్ ఇప్పట్లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 9, 2012, 14:48 [IST]
English summary
Suzuki has revealed the S-Cross concept car at the Paris Motor Show. The S-Cross concept is a crossover and is indicative of the design philosophy of Suzuki's next generation crossovers. The S-Cross could well be the next SX4 crossover.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+