పార్కింగ్ చేయడంలో పురుషుల కన్నా స్త్రీలే బెస్ట్: స్టడీ

తాజాగా.. లండన్‌లో మహిళల పార్కింగ్ విషయమై జరిపిన పరిశోధనలో వారు పురుషుల కన్నా చక్కగా పార్కింగ్ చేస్తారని వెల్లడైంది. పార్కింగ్ స్థలాన్ని గుర్తించడంలోనూ, సదరు స్థలంలో వాహనాన్ని చక్కగా నిలపడంలోనూ పురుషుల కన్నా మహిళలే బెస్ట్ అని తేలింది. అయితే, ఇలా పార్కింగ్ చేయడానికి పురుషుల కన్నా స్త్రీలే అధిక సమయం తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయింది.
కాస్త లేట్ అయితేనేం, మహిళలు తమ కారును సురక్షితంగా పార్క్ చేయడమే కాకుండా పక్కవాళ్ల కార్లను సురక్షితంగా ఉంచుతున్నారు కదా..!! స్త్రీ, పురుషుల మధ్య నిర్వహించిన ఈ ప్రయోగంలో మొత్తం 20 పాయింట్లకు గానూ స్త్రీలు 13.4 నాలుగు స్కోర్ చేయగా, పురుషులు 12.3 స్కోర్ చేయడం జరిగిందని ఈ పరిశోధన నిర్వహించిన ప్రొఫెషనల్ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ నీల్ బీసన్ తెలిపారు. మరి మీరేంమంటారు.. పార్కింగ్ చేయడంలో ఎవరు బెస్ట్..?


Click it and Unblock the Notifications








