ప్రపంచపు కోటీశ్వరులు, వారి కార్లు

వాళ్లంతా ప్రపంచలో కెల్లా అత్యంత ధనవంతులు. ప్రతిరోజు డబ్బులుతో మునిగి తేలుతుంటారు. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు. అందులో మన భారతీయులు కూడా కొందరు ఉన్నారు. మరి వాళ్లు ఉపయోగించిన/ఉపయోగించే విలాసవంతమైన వాహనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!!

బిల్ గేట్స్ - పోర్షే 959 కూపే
మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపకుడు, ప్రపంచంలో కెల్లా అత్యధిక ధనవంతుడు అయిన బిల్ గేట్స్‌ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్షేకు అతిపెద్ద అభిమాని. బిల్ గేట్స్ తన కెరీర్‌లో అనేక పోర్షే కార్లను ఉపయోగించారు. అందులో అతనికి నచ్చిన కారు మాత్రం పోర్షే 959 కూపే అని చెప్పాలి. బిల్ గేట్స్ కొనుగోలు చేసిన సమయంలో ఆ కారు ధర సుమారు 2.2 కోట్లు. పోర్షే కంపెనీ కేవలం ఇలాంటివి 230 కార్లను మాత్రమే తయారు చేసింది.

కార్లోస్ స్లిమ్ హెలు - బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్
అనేక సార్లు ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాధించుకున్న సంపన్నుడు కార్లోస్ స్లిమ్ హెలుకు బెంట్లీ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. మెక్సికోకు చెందిన ఈ వ్యాపారవేత్త బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్ లగ్జరీ సెడాన్‌ను ఉపయోగిస్తారు. ఈ కారు ధర సుమారు రూ.6 కోట్లు.

ఎరిక్ ఎమెర్సన్ షమిట్ - టొయోటా ప్రియస్
గూగుల్ సెర్చ్ ఇంజన్ స్థాపించిన వారిలో ఒకరైన ఎరిక్ చాలా సింపుల్ వ్యక్తి. ఇతను జర్మన్ కార్ మేకర్ టొయోటా అందిస్తున్న హైబ్రిడ్ కారు టొయోటా ప్రియస్‌ను వాడుతుంటారు. మన దేశంలో దీని ఖరీదు సుమారు రూ.28 లక్షలు.

లౌరెన్ పవర్ జాబ్స్ - ఆడి ఏ5
యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లౌరెన్ పవర్ జాబ్స్ తన ఆడంబరాలకు దూరంగా సింపుల్‌గా ఆడి ఏ5 కారును ఉపయోగిస్తుంది.

మార్క్ జుకెర్‌బర్గ్ - అక్యూర్ టిఎస్ఎక్స్
ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను స్థాపించిన మార్క్ జుకెర్‌బర్గ్ అతి పిన్న వయస్సులోనే ప్రపంచంలో కెల్లా అత్యంత సంపన్నులైన వారిలో జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. అయితే మార్క్ జుకెర్‌బర్గ్ కూడా సింపుల్‌గానే అక్యూర్ టిఎస్ఎక్స్ (హోండా సబ్ బ్రాండ్) కారును ఉపయోగిస్తుంటాడు. అమెరికాలో ఈ కారు ధర సుమారు 30,000 డాలర్లు.

ముఖేష్ అంబానీ - మేబాక్
ఇండియన్ బిలియనీర్ అయిన ముఖేష్ అంబానీ వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ, అతను ఎక్కడికి వెళ్లినా ఎక్కువగా కనిపించేది మాత్రం మేబాక్ కారే. ఇది జర్మన్ లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న లగ్జరీ బ్రాండ్.

రతన్ టాటా కార్ కలెక్షన్
టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థలకు అధినేత అయిన రతన్ టాటా మంచి కార్ కలెక్షనే ఉంది. ఇతని వద్ద ఓ మాసేరటి క్వాట్రాప్రోట్, జాగ్వార్ ఎక్స్ఎఫ్, హోండా అకార్డ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మొదలైన కార్లు ఉన్నాయి.

విజయ్ మాల్యా - మేబాక్
లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యాకు కార్లంటే మహా క్రేజ్. ఇతని వద్ద ఉన్న కార్లతో ఓ చిన్న సైజు మ్యూజియంనే పెట్టుకోవచ్చు. ఇండియన్ ఫార్ములా వన్ టీమ్ (సహారా ఫోర్స్) యజమాని అయిన విజయ్ మాల్యా వద్ద అనేక ఫెరారీ కార్లు, బెంట్లీ కార్లు, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ఇతని వద్ద మెర్సిడెస్ మేబాక్ ఎస్67 లగ్జరీ సెడాన్ కూడా ఉంది.

అనీల్ అంబానీ - లాంబోర్ఘినీ
ముఖేష్ అంబానీ వద్ద లగ్జరీ కార్లుంటే అనీల్ అంబానీ వద్ద స్పోర్ట్స్ కార్లున్నాయి. అనీల్‌కు వేగంగా వెళ్లే కార్లంటే మంచి క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతని కార్ కలెక్షన్‌లో ఓ లాంబోర్ఘినీ గల్లార్డో కారు కూడా ఉంది.

ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ అస్లౌద్ - రోల్స్ రాయిస్ ఫాంటమ్
సౌదీ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ అస్లౌద్ వద్ద లగ్జరీ కార్లకు కొదవేలేదు. ఆయన వద్ద ఎన్ని కార్లు ఉన్నప్పటికీ, తన ఫేవరేట్ కారు మాత్రం రోల్స్ రాయిస్ ఫాంటమేనట.

More from DriveSpark

Article Published On: Sunday, November 11, 2012, 12:05 [IST]
English summary
What do Billionaires from across the globe have in common? Their love for cars will probably be the right answer. While billionaires of the old times built huge palaces and castles to display their wealth, the modern billionaire splurges his wealth on cars. Here are some of the world's richest men and their favourite cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+