2013 కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్
కరిజ్మా ప్రియులకు గుడ్ న్యూస్. దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ అందిస్తున స్పోర్ట్స్ బైక్ 'హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్'లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. మకావ్‌లో నిర్వహించిన హీరో గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్ సందర్భంగా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజూలా ఈ కొత్త 2013 కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌ను ఆవిష్కరించారు.
ఇదివరకటి కరిజ్మా జెడ్ఎమ్ఆర్ కన్నా మరింత ఎక్కువ పవర్‌తో, స్పోర్టీ పెర్ఫామెన్స్‌తో, ఆకర్షనీయమైన లుక్‌తో కొత్త 2013 కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌ను తయారు చేశారు. సరికొత్త డిజైన్, కొత్త బాడీ ప్యానెల్స్, కొత్త హెడ్‌లైట్స్, స్ప్లిట్ సీట్స్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్, కొత్త సైలెన్సర్ వంటి మార్పులను కొత్త కరిజ్మాలో గమనించవచ్చు. అయితే, వెనుక వైపు మోనోషాక్ అబ్జార్వర్‌కు బదులుగా డ్యూయెల్ షాక్ అబ్జార్వర్లను ఉపయోగించారు.

కొత్త 2013 హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌లో 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్250ఆర్, బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్, కెటిఎమ్ డ్యూక్200 వంటి మోడళ్లతో పోటీ పడనుంది. అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్) కంపెనీతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత ఈ జాయింట్ వెంచర్ నుంచి తొలి ఉత్పత్తి కావటంతో, దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ పండుగ సీజన్లో కొత్త కరిజ్మా విడుదలయ్యే ఆస్కారం ఉంది.
ఇదిలా ఉండే, వచ్చే ఏడాది చవరి నాటికి 15కు పైగా కొత్త ఉత్పత్తులను (సరికొత్త ద్విచక్ర వాహనాలతో పాటుగా, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న మోడళ్లకు రిఫ్రెష్డ్ వెర్షను) మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, వీటిలో అధిక భాగం ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని పవన్ ముంజాల్ చెప్పారు.


Click it and Unblock the Notifications








