సెబాస్టియన్ వెటెల్‌కు రూ.21 లక్షల జరిమానా; ఎందుకు?
జర్మనీకి చెందిన రెడ్‌బుల్ రేసర్ సెబాస్టియన్ వెటెల్ గడచిన ఆదివారం గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో జరిగిన 2013 ఇండియన్ గ్రాండ్ ప్రిలో విజయం సాధించడంతో, అతి తక్కువ వయస్సులో (26 ఏళ్లు) వరుసగా నాలుగు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న ఘనత దక్కించుకున్నాడు ఈ జర్మన్ బుల్లోడు.
ఈ అనూహ్య విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నానే ఆనందంతో సెబాస్టియన్ ఎఫ్ నిబంధనలకు విరుద్ధంగా తన విజయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. దీనిపై మండిపడిన ఎఫ్ఐఏ వెటెల్‌కు 25,000 యూరోల జరిమానా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.21 లక్షలు) విధించారు. అసలు ఇంతకీ, సెబాస్టియన్ వెటెల్ చేసిన తప్పు ఏంటనుకుంటున్నారా..?

ఏ ఫార్ములా వన్ డ్రైవర్ అయినా, రేస్ ముగిసిన తర్వాత తన ఎఫ్1 కారును నేరుగా పార్కింగ్ స్టాండ్ వద్దకు తీసుకొచ్చి నిలపాలి. కానీ సెబాస్టియన్ వెటెల్ అలా చేయకుండా, తన ఎఫ్1 కారును నేరుగా బిఐసిలోని మెయిన్ గ్రాండ్ స్టాండ్ వద్దకు తీసుకువచ్చి, కారు రబ్బర్ టైర్లు అరిగిపోయేలా గుండ్రంగా గిరికీలు కొట్టించి, కారు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేయటం, ఆ తర్వాత కారు ముందుకు వచ్చి కారుకు సలామ్ కొట్టడం చేశాడు.
ఇదంతా ఆడియో/వీడియో సాక్ష్యాలతో చూసిన ఎఫ్ఐఏ వెటెల్‌కు జరిమానా విధించింది. ఏదేమైనప్పటికీ, ఈ చిన్న సంఘటన వెటెల్‌ను ఏమీ బాధించలేదు. భారత్‌లో ఫార్ములా వన్ ప్రారంభమైనప్పటి నుంచి (2011 నుంచి) ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఈ టైటిల్ నెగ్గి వెటెల్ ‘హ్యాట్రిక్' నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 2013 ఇండియన్ గ్రాండ్ ప్రిలో, 60 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ ఒక గంటా 31 నిమిషాల 12.187 సెకన్లలో పూర్తి చేశాడు.



Click it and Unblock the Notifications








