అక్టోబర్ నాటికి మార్కెట్లోకి రానున్న 2013 స్కొడా ఆక్టావియా
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఆటో ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసిన సరికొత్త 2013 స్కొడా ఆక్టావియాను రానున్న అక్టోబర్ నెల నాటికి భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. గడచిన మార్చ్ నెలలో జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ తమ ప్రొడక్షన్ వెర్షన్ ఆక్టావియాను ఆవిష్కరించింది.
స్కొడా ఇండియా ఇప్పటికే 2013 ఆక్టావియాను భారత రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే అక్టోబర్ నాటికి ఇది భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.14 లక్షల నుంచి రూ.18.50 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఇది లభ్యం కానుంది.
పెట్రోల్ వెర్షన్ ఆక్టావియోలో 1.8 లీటర్ టిఎస్ఐ టర్బో ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 180 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ ఆక్టావియోలో 2.0 లీటర్ టిడిఐ టర్బో ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్కొడా ఇండియా, 2013 ఆక్టావియా సెడాన్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనుంది. అత్యుత్తమ ఇంటీరియర్స్, ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఫీచర్స్, అధునాత టెక్నాలజీ మరియు ఆకట్టుకునే మైలేజ్ వంటి సదుపాయాలతో స్కొడా తమ సరికొత్త 2013 ఆక్టావియా రూపొందించింది.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుంచి పాపులర్ అయిన కొత్త ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త ఆక్టావియాను తయారు చేశారు. పాత వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే, 2013 స్కొడా ఆక్టావియా అన్ని విధాలుగా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉండనుంది. గ్లోబల్ మార్కెట్లలో 2013 స్కొడా ఆక్టావియా నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం అవుతోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








