భారత్‌లో 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ప్రీబుకింగ్స్ షురూ

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను త్వరలోనే కస్టమర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుత ఎస్-క్లాస్ సెడాన్ కన్నా మరింత మెరుగ్గా, అధునాత ఫీచర్లతో కొత్త 2014 ఎస్-క్లాస్ సెలూన్ లభ్యం కానుంది.

వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త ఎస్-క్లాస్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ 2014 ఎస్-క్లాస్ లగ్జరీ కారు కోసం విడుదలకు ముందే ప్రీబుకింగ్‌లను ప్రారంభించినట్లు సమాచారం. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారును కొనే ధరతో (రూ.25 లక్షలతో) కొత్త ఎస్-క్లాస్ కారును బుక్ చేసుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్500 లిమిటెడ్ ఎడిషన్ కోసం ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు, భారత మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు కేవలం 125 యూనిట్లు మాత్రమే లభ్యం కానున్నాయి. అందుకే, ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ అన్న చందంగా ఈ మోడల్ కోసం ప్రీబుకింగ్‌లను ప్రారంభించారు.

2014 Mercedes Benz S Class

అయితే, రెగ్యులర్ ఎస-క్లాస్ ఎస్350సిడిఐ మాత్రం వచ్చే ఏడాది మధ్య భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా.. ఈ కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్500 లిమిటెడ్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇందులో 455 పిఎస్‌ల శక్తిని, 616 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. దీని ఫెండర్‌పై 'ఎడిషన్ 1' అనే బ్యాడ్జ్ ఉంటుంది.

ఈ కొత్త ఎడిషన్ 1 మోడల్, 258 పిఎస్‌ల శక్తిని, 619 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్ కలిగిన స్టాండర్డ్ ఎస్350 సిడిఐ మోడల్ కన్నా ఎంతో విలాసవంతమైనది. కొత్త 2014 ఎస్-క్లాస్ కేవలం నలుపు, తెలుపు రంగులలో మాత్రమే లభ్యమవుతుంది. ఇది ఈ సెగ్మెంట్లో ఆడి ఏ8, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ వంటి లగ్జరీ కార్లతో పోటీ పడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2013, 11:14 [IST]
English summary
2014 Mercedes-Benz S-Class is scheduled to be launched in India early in January, but Merc dealerships have reportedly started accepting bookings for the new king of premium luxury sedans already. The pre bookings are for the Mercedes S500 Limited Edition, of which only 125 units will be available in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+