డిసెంబర్ 5న కొత్త 2015 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ..

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న పవర్‌ఫుల్ కారు 'ఫోర్డ్ మస్టాంగ్'లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను తీసుకురానుంది. డిసెంబర్ 5న ఫోర్డ్ తమ కొత్త '2015 మస్టాంగ్'ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ నేపథ్యంలో, ఫోర్డ్ మోటార్స్ ఇప్పటికే తొలిసారి విస్తృతంగా సోషల్ మీడియా క్యాంపైన్‌ను ప్రారంభించింది.

సరికొత్త డిజైన్, మంచి రీఇన్ఫోటైన్‌మెంట్, సాటిలేని పెర్ఫామెన్స్, అధునాతన టెక్నాలజీల కలయికతో కొత్త మస్టాంగ్‌ను అభివృద్ధి చేశామని, ఇది మరో 50 ఏళ్ల పాటు చిరకాలంగా నిలిచిపోతుందని ఫోర్డ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ సర్వీస్) జిమ్ ఫేర్లీ తెలిపారు.

Ford Mustang

ఫోర్డ్ మస్టాంగ్‌ను పరిచయం చేసి 50 ఏళ్లు పూర్తయ్య నాటికి ఈ కొత్త మస్టాంగ్‌ను విడుదల చేయాలని ఫోర్డ్ భావిస్తోంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ఇది మార్కెట్లో విడుదల కానుందన్నమాట. ప్రస్తుతం ఫోర్డ్ విడుదల చేయబోతున్న ఈ కొత్త మస్టాంగ్ 6వ తరానికి (సిక్స్త్ జనరేషన్) చెందినది కావటం విశేషం.

కొత్త ఫోర్డ్ మస్టాంగ్‌లో వి6, వి8 ఇంజన్లతో పాటుగా తమ పాపులర్ ఈకోబూస్ట్ (2.3 లీటర్, ఫోర్ సిలిండర్, 310 హార్స్ పవర్) ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఫోర్డ్ తమ మస్టాంగ్ కారును భారత మార్కెట్లో విడుదల చేయవచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, November 23, 2013, 13:13 [IST]
English summary
Ford has officially announced the reveal date for all new 2015 Ford Mustang as December 5. For the first time Ford has stated extensive social media campaigns ahead of the reveal of its iconic muscle car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+