2030 నాటికి 90 శాతం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లే: గూగుల్
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రోత్సాహకర స్పందన లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థాయి అడుగంటిపోతుండటం, వీటితో నడిచే వాహనాల వలన వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటంతో పరిశోధకులు, ప్రకృతికి హాని కలిగించని ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రూపొందించే పనిలో తలమునకలై ఉన్నారు.
ఈ పరిశోధనలకు ఫలితమే నేడు మనం రోడ్లపై చూస్తున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు కొన్ని దేశాలకు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాల దిగ్గజం గూగుల్ విశ్లేషణ ప్రకారం, 2030వ సంవత్సరం నాటికి రోడ్లపై దాదాపు 90 శాతం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలే ఉండొచ్చని తెలుస్తోంది.
మెక్‌కిన్సీ అండ్ కంపెనీకు చెందిన యూఎస్ లో కార్బన్ ఎకనామిక్స్ టూల్ సాయంతో గూగుల్ ఫిలాంత్రోపిక్ విభాగం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్యాటరీ ధరలో భారీ తగ్గుదల, విద్యుత్ ఉత్పాదకత పెరుగుదల వలన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరగవచ్చునని ఈ విశ్లేషణలో తేలింది.



Click it and Unblock the Notifications








