బస్ టికెట్‌తో పాటు 'భోజనం' కూడా బుక్ చేసుకోవచ్చు!
హైదరాబాద్: ఇప్పుడు బస్ టికెట్‌తో పాటుగా మీకు నచ్చిన భోజనాన్ని కూడా మీ ఫేవరెట్ రెస్టారెంట్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కంపెనీ అభిబస్ డాట్ కామ్ (www.abhibus.com) తమ యాత్రికులg/ప్రయాణికుల కోసం 'బస్‌మీల్' (BUSMEAL) ను ప్రవేశపెట్టింది.
ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్ నుంచి హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు బయలుదేరేందుకు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు, టికెట్‌తో పాటుగా తమకు నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోవచ్చు. డెలివరీ పార్ట్‌నర్ ఫుడీస్ సహకారంతో అభిబస్ ఈ స్కీమ్ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా, కస్టమర్లు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే, పక్కన లిస్ట్‌లో అందుబాటులో ఉండే రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందులో సదరు మెను, భోజన ధర తదితర వివరాలు ఉంటాయి. బుక్ చేసుకున్న భోజనాన్ని ప్యాక్‌చేసిన భోజనాన్ని లీక్‌ప్రూఫ్ ప్యాకింగ్ ద్వారా అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్యారడైజ్, షాదాబ్, సర్వీ, 4 సీజన్స్, నాన్‌కింగ్, లిటిల్ ఇటలీ, ఆఫెన్, బియాండ్ కఫీ, వసంత భవన్, మినర్వా కాఫీ షాప్ తదితర హోటళ్ల నుండి భోజన ప్యాకెట్లను అందించనున్నట్లు అభిబస్ సీఈఓ సుధాకర్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుండి మాత్రమే అందుబాటులో ఉన్న సౌకర్యం త్వరలోనే బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, పూనే, ముంబై, న్యూఢిల్లీలకు విస్తరిస్తామని ఆయన తెలిపారు.



Click it and Unblock the Notifications








