బస్సులు, ట్రక్కులకు ఏబిఎస్ తప్పనిసరి: భారత ప్రభుత్వం

"భద్రత విషయంపై భారీ వాహనాలలో ఈ కీలక టెక్నాలజీని చేర్చే ప్రక్రియను ప్రారంభించాం. ఇది అధిక వేగాల వద్ద భారీ వాహనాలు జారిపోవటం లేదా జారిపోవటాన్ని తగ్గించడం చేస్తుంది. ఇదే సమయంలో ఇతర వాహనాల్లో కూడా ఈ ఫీచర్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నామ"ని పేరు చెప్పడానికి ఇష్టం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఓ ప్రముఖ ఆంగ్లపత్రికతో తెలిపారు. అంటే, ఇప్పటి వరకూ కార్లు, మోటార్‌సైకిళ్లకు మాత్రమే పరిమితమైన ఏబిఎస్ ఫీచర్ ఇకపై అన్ని రకాల బస్సులు, భారీ ట్రక్కులలో కూడా అందుబాటులోకి రానుందన్నమాట.
ఏబిఎస్ అంటే ఏమిటి..? అదెలా పనిచేస్తుంది..?
సాదారణ బ్రేకింగ్ సిస్టమ్ (డ్రమ్/డిస్క్)లో రోడ్డుపై అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరిగడం (టైర్ రోలింగ్) ఆగిపోయి టైర్లు రోడ్డపై రాచుకుంటూ, బ్రేకింగ్ దూరం పెరిగి వాహనం జారిపోయే ఆస్కారం ఉంది. అయితే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరగడం ఆగిపోకుండానే వాహన వేగాన్ని పూర్తిగా నియంత్రించి, బ్రేకింగ్ దూరాన్ని (బ్రేకింగ్ డిస్టన్స్) తగ్గించి ప్రమాదం నుండి తప్పించుకోవడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








