నానో ఫ్లాప్; టాటా నుంచి మరొక కాంపాక్ట్ కారు 'ఎక్స్ఓ'!

By Ravi

Tata Compact Car
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారు 'టాటా నానో' అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోతుండటంతో, కంపెనీ ఇప్పుడు మరొక కొత్త కాంపాక్ట్ కారును విపణిలో విడుదల చేయాలని యోచిస్తోంది. టాటా నానో కారు కోసం కంపెనీ గుజరాత్‌లోని సనంద్ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటులో కేవలం నానో కార్లు మాత్రమే ఉత్పత్తి అవుతాయి.

అయితే, టాటా నానో అమ్మకాలు మందకొడిగా సాగుతుండటంతో టాటా మోటార్స్ ఈ ప్లాంటులో నానో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా తగ్గించి వేసింది. నానో విషయంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్దిరోజులకు ఈ ప్లాంటు మూతపడే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో, సనంద్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇక్కడే మరొక కాంపాక్ట్ కారును తయారు చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది.

సనంద్ ప్లాంటుపై కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టి ఉండటం, వీటికి తగిన ప్రతిఫలం ఈ ప్లాంటును లభించకపోవడంతో ఈ ప్లాంటులో ఇతర మోడళ్లను ఉత్పత్తి చేసేలా దీనిని మోడిఫై చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం టాటా మోటార్స్ 'ఎక్స్ఓ' అనే పేరతో ఓ కాంపాక్ట్ కారు అభివృద్ధి చేస్తోంది. 2015 నాటికి ఇది మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ ఇండికా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఎక్స్ఓ కాంపాక్ట్ కారును కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. సనంద్ ప్లాంటులో 20 శాతానికి తగ్గకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ఎక్స్ఓ కారును సనంద్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, May 13, 2013, 11:23 [IST]
English summary
According to sources, Tata Motors is considering to produce another compact car XO at its Sanand plant alongside the small car Tata Nano. This move is in a bid to optimise production capacities at the Gujarat plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+