అమేజ్ ఎఫెక్ట్: జులైలో 156 శాతం పెరిగిన హోండా సేల్స్

By Ravi

జపాన్‍‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమటెడ్ దేశీయ విపణిలో విడుదల చేసిన మొట్టమొదటి డీజిల్ కారు 'అమేజ్'కు భారీ డిమాండ్ లభిస్తున్న సంగతి తెలిసినదే. హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌తో కంపెనీ అమ్మకాలు ఇదివరకెన్నడూ లేనివిధంగా జోరుగా సాగుతున్నాయి. గడచిన జులై నెలలో హోండా కార్స్ ఇండియా అమ్మకాలు ఏకంగా 156 శాతం వృద్ధి చెందాయి.

జులై 2012లో 4,386 యూనిట్లను విక్రయించిన హోండా జులై 2013లో 11,223 యూనిట్లను విక్రయించింది. కంపెనీ మొత్తం అమ్మకాలలో 50 శాతానికి పైగా అమ్మకాలు హోండా అమేజ్ నుంచి వచ్చాయి. ఏప్రిల్-జులై 2013 మధ్య కాలంలో హోండా కార్స్ ఇండియా మొత్తం అమ్మకాలు 65 శాతం వృద్ధి చెంది 40,350 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం ఇదే సమయంలో ఇవి 24,462 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

జులై 2013లో కంపెనీ ఎగుమతులు 756 యూనిట్లు నమోదయ్యాయి. కంపెనీ జులై అమ్మకాల్లో మోడళ్ల వారీ వివరాలు ఇలా ఉన్నాయి:

  • హోండా బ్రయో - 2,602 యూనిట్లు
  • హోండా సిటీ - 1,953 యూనిట్లు
  • హోండా సిఆర్-వి - 133 యూనిట్లు
  • హోండా అకార్డ్ - 20 యూనిట్లు
  • హోండా అమేజ్ - 6,515 యూనిట్లు
Honda Amaze

More from DriveSpark

Article Published On: Saturday, August 3, 2013, 16:59 [IST]
English summary
Honda Cars India Ltd has reported a domestic sales growth of 156 per cent during July 2013 by selling 11,223 units as against 4,386 units sold in July 2012. Part of the success is the Amaze sedan which accounted for more than 50 per cent of the total sales volume.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+