అక్టోబర్‌లో రానున్న అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ వెర్షన్
భారతదేశపు ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్, జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ కంపెనీలు భారత మార్కెట్లో అందిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సివి) 'అశోక్ లేలాండ్ దోస్త్' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని సరికొత్త ప్యాసింజర్ వాహనాన్ని అభివృద్ధి చేయనున్నారు. నిస్సాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, అశోక్ లేలాండ్ తమ ప్లాంటులో దోస్త్ ప్యాసింజర్ వెర్షన్ వాహనాన్ని తయారు చేయనుంది.
ఈ ఏడాది అక్టోబర్ నాటికి అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. 14-మంది ప్రయాణికులకు చోటు కల్పించేలా దీనిని డిజైన్ చేయనున్నారు. దోస్త్ ఎల్‌సివిలో ఉపయోగించిన అప్‌గ్రేడెడ్ 1.5 లీటర్ టిడిసిఆర్ ఇంజన్‌నే దోస్త్ ప్యాసింజర్ వెర్షన్‌లోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 58 బిహెచ్‌పిల శక్తిని, 157.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
దోస్త్ ప్యాసింజర్ వెర్షన్‌తో పాటుగా నిస్సాన్ ఇండియా అందిస్తున్న ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అశోక్ లేలాండ్ బ్యాడ్జింగ్‌తో రానున్న స్టైల్ ఎమ్‌పివి కూడా మరికొద్ది నెలల్లోనే మార్కెట్లో విడుదల కానుంది. అశోక్ లేలాండ్ తమ స్టైల్ ఎమ్‌పివి 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. ఇందులో నిస్సాన్ నుంచి గ్రహించిన పాపులర్ 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్)తో లభ్యం కానుంది.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్
అశోక్ లేలాండ్ భారత మార్కెట్లో అందిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సివి) 'అశోక్ లేలాండ్ దోస్త్' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని సరికొత్త ప్యాసింజర్ వాహనాన్ని అభివృద్ధి చేయనుంది.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్
అశోక్ లేలాండ్ నుంచి రానున్న ఈ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్ 14-సీటింగ్ కెపాసిటీతో రావచ్చని అంచనా.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్
దోస్త్ ఎల్‌సివిలో ఉపయోగించిన అప్‌గ్రేడెడ్ 1.5 లీటర్ టిడిసిఆర్ ఇంజన్‌నే దోస్త్ ప్యాసింజర్ వెర్షన్‌లోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 58 బిహెచ్‌పిల శక్తిని, 157.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్
ప్యాసింజర్ వెర్షన్ దోస్త్ ఈ ఏడాది అక్టోబర్ నెల నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్
దోస్త్ ప్యాసింజర్ వెర్షన్‌తో పాటుగా నిస్సాన్ ఇండియా అందిస్తున్న ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అశోక్ లేలాండ్ బ్యాడ్జింగ్‌తో రానున్న స్టైల్ ఎమ్‌పివి కూడా మరికొద్ది నెలల్లోనే మార్కెట్లో విడుదల కానుంది.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్
అశోక్ లేలాండ్ తమ స్టైల్ ఎమ్‌పివి 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది.

అశోక్ లేలాండ్ దోస్త్ ప్యాసింజర్ క్యారియర్
ఇందులో నిస్సాన్ నుంచి గ్రహించిన పాపులర్ 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్)తో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








