హైపెర్ఫామెన్స్ కార్ల కోసం ఏఎమ్‌జితో దోస్తీ కట్టిన ఆస్టన్ మార్టిన్

ఆస్టన్ మార్టిన్ అంటేనే పవర్‌ఫుల్ కార్లకు పెట్టింది పేరు. అలాంటిది ఆస్టన్ మార్టిన్ మరింత శక్తివంతమైన పెర్ఫామెన్స్ ఇంజన్లను అభివృద్ధి చేసే కంపెనీతో చేతులు కలిపితే ఇక ఆ పవర్‌కు తిరుగే ఉండదు కదా..!

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్, జర్మన్ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన పెర్ఫామెన్స్ డివిజన్ ఏఎమ్‌జిలు కలిసి పనిచేయనున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ, ఇరు కంపెనీలు అధికారికంగా తమ డీల్‌ను ప్రకటించాయి. ఈ ఒప్పందంలో భాగంగా, ఆస్టన్ మార్టిన్ కంపెనీ ఏఎమ్‌జి వద్ద ఉన్న వనరులను ఉపయోగించుకొని హైపెర్ఫామెన్స్ కార్లను ఉత్పత్తి చేయనుంది.

కొత్త తరం ఆస్టన్ మార్టిన్ కార్లను తయారు చేసేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వి8, వి12 వంటి శక్తివంతమైన ఇంజన్లను ఆస్టన్ మార్టిన్ కార్లలో ఉపయోగిస్తారు. ఈ ఒప్పందం వలన ఆస్టన్ మార్టిన్ రెగ్యులర్ ప్రొడక్షన్, సేల్స్‌కు ఎలాంటి అంతరాయం ఉండబోదు.

Aston Martin

ఆస్టన్ మార్టిన్ తమ నెక్స్ట్ జనరేషన్ స్పోర్ట్స్ కార్ల అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కీలక సప్లయర్ల నుంచి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని గ్రహిస్తుందని, ఇందులో భాగంగానే, మెర్సిడెస్ ఏఎమ్‌జితో ఒప్పందం కుదుర్చుకున్నామని కంపెనీ డెవలప్‌మెంట్ హెడ్ లాన్ మినార్డ్స్ తెలిపారు.

భవిష్యత్తులోని ఆస్టన్ మార్టిన్ కార్లను సిసి100 స్పీడ్‌స్టర్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసే ఆస్కారం ఉంది. తమ సంస్థను ప్రాంభించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'ఆస్టన్ మార్టిన్ సిసి100 స్పీడ్‌స్టర్ కాన్సెప్ట్' అనే కారును ఈ బ్రిటీష్ ఆటో దిగ్గజం ఆవిష్కరించింది. ఇందులో శక్తివంతమైన 6.0 లీటర్ వి12 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఆస్టన్ మార్టిన్ 100సిసి స్పీడ్‌స్టర్ కాన్సెప్ట్ కేవలం నాలుగు సెకండ్ల కన్నా తక్కువ సమయంలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 290 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 31, 2013, 15:33 [IST]
English summary
It official. The Gaydon, UK based automaker Aston Martin and Mercedes-Benz's performance division AMG have taken the first formal step towards a deep rooted partnership by signing a Letter of Intent. Details of a full fledged working partnership will be worked out in the coming months and both parties believe a final agreement will be signed before the end of this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+