వంద వసంతాలు పూర్తి చేసుకోనున్న ఆస్టన్ మార్టిన్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రిటీష్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ఆస్టన్ మార్టిన్ ఈనెల 15తో వంద వసంతాలను పూర్తి చేసుకోనుంది. గడచిన 99 సంవత్సరాలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఉత్పత్తులను అందిస్తూ వచ్చిన ఆస్టన్ మార్టిన్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన మోడల్ వాంక్విష్. పాపులర్ మోడల్ డిబి5 స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది. జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ఆస్టన్ మార్టిన్ ఆటోమొబైల్ ప్రపంచానికి మరింత చేరువయ్యింది.
జనవరి 15, 2013 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఆస్టన్ మార్టిన్, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పురాతన ఏ3, సరికొత్త వాంక్విష్, అల్టిమేట్ జిటి మోడళ్లను కంపెనీ పుట్టినిళ్లయిన చెల్సీలోని హెన్నికర్ మెవ్స్‌లో ప్రదర్శనకు ఉంచనుంది. జనవరి 15, 1913లో లైనెల్ మార్టిన్, రాబెర్ట్ బామ్‌ఫోర్డ్‌లు ఓ వెంచర్‌ను ప్రారంభించారు. అప్పట్లో ఈ కంపెనీలను బామ్‌ఫోర్డ్ అండ్ మార్టిన్ అని పిలిచేవారు. ఆ తర్వాత దీనిని ఆస్టన్ మార్టిన్‌గా పేరు మార్చడం జరిగింది. ఆస్టన్ మార్టిన్ కార్లు పవర్, పెర్ఫామెన్స్, డిజైన్, క్వాలిటీ, టెక్నాలజీ వంటి అంశాలకు పెట్టింది పేరు. ఆస్టన్ మార్టిన్ తమ కార్ల తయారీలో మర యంత్రాలను ఉపయోగించకుండా పూర్తిగా చేతుల్తోనే చేస్తుంది.
ప్రపంచ యుద్ధాలకు ముందుకు ఆస్టన్ మార్టిన్ తయారు చేసిన ఓపెన్ బాడీ టూ-సీటర్ స్పోర్ట్స్ కార్లు అప్పట్లో మంచి ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత వచ్చిన డిబి2/4, డిబి4, డిబి5, డిబి6, డిబిఎస్, వి8 వ్యాంటేజ్, విరాజ్, డిబి7, వాంక్విష్ మోడళ్లు ఆస్టన్ మార్టిన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆస్టన్ మార్టిన్‌కు 41 దేశాల్లో 146 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. మన దేశంలో కూడా ఆస్టన్ మార్టిన్ తమ ఉత్పత్తులను అందిస్తోంది. ఇక్కడి మార్కెట్లో వీటి ధరలు రూ.2 కోట్ల నుంచి మొదలయ్యి రూ.22 కోట్ల వరకూ ఉన్నాయి.

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్

ఆస్టన్ మార్టిన్ ప్లాంట్



Click it and Unblock the Notifications








