ఆస్టన్ మార్టిన్ కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఇంజన్లు!
జేమ్స్ బాండ్ సినిమాల్లో పాపులర్ అయిన అత్యంత ఖరీదైన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లలో బెంజ్ ఇంజన్లను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ ఇకపై జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇంజన్లను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈమేరకు ఆస్టన్ మార్టిన్‌తో మెర్సిడెస్ బెంజ్ మాతృసంస్థ డైమ్లర్ విడిభాగాలను సరఫరా చేసేందుకు మరియు సాంకేతిక మద్ధతుపై సదరు కంపెనీతో కలిసి పనిచేసేందు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఆస్టన్ మార్టిన్ యజమానులు, ఇద్దరు ప్రధాన షేర్‌హోల్డర్లు, ఇన్వెస్ట్ఇండస్ట్రియల్ అండ్ కువైట్ లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్ దార్‌ల ఈ చర్చలు సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై డైమ్లర్ అధికారిక ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ఇరు కంపెనీల మధ్య ఒప్పందంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇరు వర్గాలు ఒకరినొకరు చాలా గౌరవించుకుంటారని వ్యాఖ్యానించారు.
ఈ చర్చలు సఫలమైతే ఆస్టన్ మార్టిన్ కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఇంజన్లను ఉపయోగించే ఆస్కారం ఉంది.



Click it and Unblock the Notifications








