జెనీవాలో మెరిసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్
ఇటీవలే 100 వసంతాలను పూర్తి చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'అస్టన్ మార్టిన్' ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో తమ సరికొత్త సెలబ్రేషన్ ఎడిషన్ వాంక్విష్ (డిబిఎస్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్)ను ఆవిష్కరించింజి. అల్టిమేట్ జిటి కార్ అని పిలువబడే ఈ ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్ లగ్జరీ కూపే కారును కేవలం 100 యూనిట్లను మాత్రమే తయారు చేయనుంది.
ఈ ఎక్స్‌క్లూజివ్ కారును త్వరలోనే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్ మాదిరిగానే వి8 వ్యాంటేజ్, డిబి9 మరియు రాపిడే మోడళ్లలో కూడా కంపెనీ సెంచరీ ఎడిషన్‌లను ప్రవేశపెట్టనుంది. ఇవి కూడా ఒక్కొక్క మోడల్‌ను 100 కార్ల చొప్పున మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు. ఇలా ఉత్పత్తి అయ్యే ప్రతి స్పెషల్ ఎడిషన్ కారుపై దాని సంఖ్యను సూచిస్తూ 1 నుంచి 100 వరకూ నెంబర్లు ఉంటాయి.
గతంలో ఇలానే ఆస్టన్ మార్టిన్ విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ హైపర్‌కార్ వన్-77లో ఉపయోగించిన సిల్వర్ స్టిచింగ్‌తో కూడిన ప్రీమియం లెథర్ ఇంటీరియర్స్‌ను ఈ సెంచరీ ఎడిషన్‌లలో కూడా కంపెనీ అందిస్తోంది. సీట్ హెడ్‌రెస్ట్‌లపై ఉండే ఆస్టన్ మార్టిన్ రెక్కల (వింగ్స్)ను స్పెషల్‌గా సిల్వర్ కలర్ దారంతో ఎంబ్రాడయిరీ చేశారు. ఈ ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్‌లో ఎక్కువగా సిల్వర్ కలర్ థీమ్‌ను ఉపయోగించటం మనం గమనించవచ్చు.

జెనీవాలో మెరిసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్

జెనీవాలో మెరిసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్

జెనీవాలో మెరిసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్

జెనీవాలో మెరిసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్

జెనీవాలో మెరిసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్

జెనీవాలో మెరిసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్
ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సెంచరీ ఎడిషన్‌లో ఉపయోగించిన శక్తివంతమైన 5.9 లీటర్, వి-12, 48-వాల్వ్ ఇంజన్ గరిష్టంగా 565 బిహెచ్‌పిల శక్తిని, 620 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 195 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.
ఈ స్పెషల్ ఎడిషన్ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు, ఇంటీరియర్ లెథర్‌కు సరిపోయేలా లెథర్ కీ పౌచ్‌లతో కూడిన రెండు గ్లాస్ కీలు, ఆస్టన్ మార్టిన్ స్క్రిప్ట్‌ను తెలిపే ధృడమైన సిల్వర్ కఫ్ లింక్స్, సాలిడ్ సిల్వర్ రోలర్ బాల్‌పెన్, బ్యాంగ్ అండ్ ఓలుఫ్సెన్ హెడ్‌ఫోన్స్ మరియు బ్యాడ్జ్‌లను పాలిష్ చేసేందుకు సిల్వర్ పాలిషింగ్ క్లాత్‌లతో కూడిన ఓ ప్రజెంటేషన్ బాక్స్‌ను కూడా ఆస్టన్ మార్టిన్ అందిస్తోంది. మరి 2013 జెనీవా మోటార్ షోలో తళుక్కుమన్న ఈ సెంచరీ ఎడిషన్ వాంక్విష్‌పై ఓ లుక్కేస్కోండి.


Click it and Unblock the Notifications








