బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1పై ఆకర్షనీయమైన ఎక్సేంజ్ ఆఫర్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు బిఎమ్‍‌డబ్ల్యూ ఎక్స్1 కోసం కంపెనీ ఓ ఆకర్షనీయమైన ఎక్సేంజ్ ఆఫర్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో భాగంగా మీ పాత కారును ఎక్సేంజ్ చేసుకొని, రూ.24.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1‌ను సొంతం చేసుకోవచ్చు.

ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకే కంపెనీ ఈ ఆఫర్‌‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1పై కంపెనీ ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా, కేవలం 5.99 లక్షల డౌన్‌పేమెంట్‌ను చెల్లించి కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత బిఎమ్‌డబ్ల్యూ డీలరును సంప్రదించండి.

BMW X1 Offer

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1లో 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 పిఎస్‌ల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు ఉత్తమ నాణ్యతను కలిగి ఉండటమే కాకుండా, పెర్ఫామెన్స్, లగ్జరీ, సేఫ్టీ వంటి విషయాల్లో ఎక్కడా కూడా రాజీపడకుండా ఉంటుంది.

గడచిన 2009లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాసోవర్ ఎన్నో ప్రశంసలు, అనేక అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. క్రాసోవర్ క్యాటగిరీలో ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్, 2010లో న్యూ కార్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులు కూడా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాసోవర్‌ను వరించాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 31, 2013, 10:31 [IST]
English summary
BMW India dealers offers an attractive exchange scheme on X1 crossover. Now you can exchange your old car and take home the BMW X1 with an attractive price tag of INR 24.99 Lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+