డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాను విడుదల చేసిన అతుల్ ఆటో

తమ జెమిని డిజెడ్‌ను విడుదల చేసేందుకు కేరళ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నామని, ఇక్కడ అన్ని తరగతులకు చెందిన ప్రజలు, అన్ని కాలాల్లో త్రిచక్ర వాహనాలను ఆశ్రయిస్తుంటారని, ఈ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉన్నందున తమ అధునాత డీజిల్ ఆటో రిక్షాను తొలుతగా కేరళ మార్కెట్లో విడుదల చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
సౌకర్యవంతమైన ప్రయాణం, ఎక్కువ లేజ్ స్పేస్, స్టయిలిష్ డ్యాష్ బోర్డ్ మరియు డ్యూయెల్ టోన్ సీట్స్‌తో కూడిన ఆకర్షనీయమైన ఇంటీరియర్స్ తమ జెమిని డిజెడ్ ఆటో యొకక్ ప్రత్యేక ఫీచర్లని కంపెనీ పేర్కొంది. ఈ ఆటోరిక్షా పికప్, మైలేజ్, విశ్వసనీయతమ మరియు భద్రత విషయాల్లో ది బెస్ట్ అనిపించుకుంటుందని అతుల్ ఆటో వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) పౌల్ జచారియా తెలిపారు.
భారత్‌లోని త్రీవీలర్ మార్కెట్లో 18 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న అతుల్ ఆటో, ఈ ఏడాది మధ్య భాగం నాటికి పెట్రోల్, సిఎన్‌జి మరియు ఎల్‌పిజి ఇంధనాలతో నడిచే ఆల్-ఫ్యూయెల్ వెర్ష్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని ఆయన చెప్పారు. రాజ్‌కోట్‌లో ఉన్న తమ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 48,000 లకు విస్తరించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో (2012-13) అతుల్ ఆటో 32,040 వాహనాలను విక్రయించి రూ.25.92 కోట్ల నికర లాభాన్ని తన ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications








