కొత్త అప్‌గ్రేడెడ్ డీజిల్ ఇంజన్‌తో లభ్యం కానున్న ఆడి ఏ4

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ4 లగ్జరీ సెడాన్‌‌లో సైలెంట్‌గా కొత్త ఇంజ్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత డీజిల్ వెర్షన్‌లో ఆఫర్ చేస్తున్న పాత ఇంజన్‌ను రీప్లేస్ చేస్తూ కొత్త డీజిల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ప్రస్తుతం దేశీయ విపణిలో ఆడి ఏ4 సెడాన్ క్రింద పేర్కొన్న ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది.

పెట్రోల్
1.8 లీటర్ టిఎఫ్ఎస్ పెట్రోల్, 170 హెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్
2.0 లీటర్ టిఎఫ్ఎస్ పెట్రోల్, 140 హెచ్‌పి పవర్, 320 ఎన్ఎమ్ టార్క్

డీజిల్
2.0 లీటర్ టర్బో డీజిల్, 143 హెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్
3.0 లీటర్ టర్బో డీజిల్, 245 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్

Audi A4

ఆడి ఏ4 సెడాన్‌లోని ఇదివరకటి 2.0 లీటర్ టర్బో డీజిల్ ఈ సెగ్మెంట్లోని పోటీదారులతో పోల్చుకుంటే తక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఈ కారు పవర్‌ను లోవర్ సెగ్మెంట్ కార్లయిన స్కొడా లారా, ఫోక్స్‌వ్యాగన్ జెట్టాలతో పోల్చవచ్చు.

అందుకే, ఆడి ఇండియా ఈ ఇంజన్ ట్యూనింగ్‌ను మార్చి మరింత శక్తివంతమైన పెర్ఫామెన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దారు. ఆడి ఏ4 సెడాన్‌లోని పాత ఇంజన్‌ను రీప్లేస్ చేస్తూ వచ్చిన ఈ కొత్త 2.02 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 177 హెచ్‌పిల పవర్‌ను, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో ఇదివరకు ఆఫర్ చేసిన సివిటి ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఇప్పుడు 8-స్పీడ్ ఆటోమేటిక్, డ్రైవ్ సెలక్ట్ టెక్నాలజీతో కొత్త ఆడి ఏ4 లభిస్తుంది. డ్రైవ్ సెలక్ట్ ఫీచర్‌లో కంఫర్ట్, డైమనిక్, కస్టమ్ అని మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. కొత్త ఇంజన్‌తో లభ్యం కానున్న ఆడి ఏ4 సెడాన్ ఇదివరకటి వెర్షన్ కన్నా సుమారు రూ.1 లక్ష ఎక్కువ ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, September 5, 2013, 16:36 [IST]
English summary
Audi India, rather silently, has introduced an upgraded engine for the A4 saloon. The new diesel engine is actually a replacement for the model that was on offer currently.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+