ఆడి ఏ4 లగ్జరీ సెడాన్‌పై జీరో పర్సెంట్ వడ్డీ స్కీమ్!
ఫైనాన్స్‌లో కార్లను కొనుగోలు చేయాలంటే వడ్డీ రేట్ల భయం వెంటాడుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జీరో పర్సెంట్ వడ్డీకే రుణాలు లభిస్తే ఎలా ఉంటుంది..? అవును, తమ లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి జీరో పర్సెంట్ (0%) వడ్డీ రేటుకే రుణ సదుపాయం కల్పిస్తామంటోది జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా.
ఈ జర్మన్ కార్ మేకర్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ ఆడి ఏ4 కోసం కంపెనీ ఈ జీరో పర్సెంట్ వడ్డీ రేట్ స్కీమ్‌ను పునఃప్రవేశ పెట్టింది. గడచిన సంవత్సరం బడ్జెట్ సమయంలో కూడా కంపెనీ ఈ ఆఫర్‌ను అందించిన సంగతి తెలిసినదే. ఆడి ఏ4 లగ్జరీ సెడాన్‌పై 36 నెలల కాల వ్యవధికి గానూ రూ.24 లక్షల రుణాన్ని జీరో పర్సెంట్ వడ్డీ (*షరతులు వర్తిస్తాయి)కే ఆఫర్ చేస్తున్నామని ఆడి ఇండియా ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది.
ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని ఆడి పేర్కొంది. త్వరపడండి ఈ ఆఫర్ స్టాక్ మిగిలి ఉన్నంత వరకూ మాత్రమే. దేశీయ విపణిలో ఆడి ఏ4 మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది అవి - 1.8 లీటర్ టిఎఫ్ఎస్ఐ (పెట్రోల్), 2.0 లీటర్ టిడిఐ (డీజిల్) మరియు 3.0 లీటర్ టిడిఐ (డీజిల్). ఈ స్కీమ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలో ఆడి ఇండియా అదీకృత డీలరును సంప్రదించండి.



Click it and Unblock the Notifications








