సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేసిన ఆడి ఇండియా
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ సంస్థ ఆడి గడచిన ఏప్రిల్ నెలలో బీజింగ్ మోటార్ షోలో ఆవిష్కరించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆడి క్యూ5 ఎస్‌యూవీ కంపెనీ నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది వరకటి క్యూ5 ఎస్‌యూవీతో పోల్చుకుంటే, కొత్త 2013 వెర్షన్ క్యూ5 ఎస్‌యూవీలో డిజైన్, ఇంజన్, పెర్ఫామెన్స్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు చేయబడ్డాయి. ఈ కొత్త క్యూ5 ఎస్‌యూవీలో మెరుగైన, అధిక మైలేజ్‌నిచ్చే ఇంజన్లను ఉపయోగించారు.
సరికొత్త 2013 ఆడి క్యూ5 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో అమర్చిన 2.0 టిడిఐ డీజిల్ ఇంజన్ శక్తిని పాత వేరియంట్ కన్నా 4 బిహెచ్‌పిలు పెంచగా, 3.0 లీటర్ వి6 టిడిఐ డీజిల్ ఇంజన్ పవర్‌ను కేవలం పవర్‌ను 1 బిహెచ్‌పి పెంచినప్పటికీ, టార్క్‌ను మాత్రం 8 కెజిఎమ్‌లకు పెంచారు. ఇకపోతే 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌లో వాల్వ్ కంట్రోల్స్, స్ట్రోక్‌లో మార్పులు, మెరుగపరచబడిన థెర్మల్ మేనేజ్‌మెంట్, రివైజ్ చేయబడిన ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్, టర్బో ఛార్జర్, సిలిండర్ హెడ్‌లో ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌ను ఇంటిగ్రేట్ చేయడం, పవర్‌ను 10 బిహెచ్‌పిలు (221 బిహెచ్‌పి) పెంచడం వంటి మార్పులు చేయబడ్డాయి.

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5

2013 ఆడి క్యూ5
కొత్త 2013 ఆడి క్యూ5 ఎస్‌యూవీలో బంపర్స్, గ్రిల్, హెడ్‌ల్యాంప్, గ్రాఫిక్స్, టైల్‌పైప్స్‌లలో మార్పులు, అలాగే ఇంటీరియర్లలో చిన్నపాటి మార్పులు చేయబడ్డాయి. భారత మార్కెట్లో ఆడి క్యూ5 వేరియంట్లు, ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* ఆడి క్యూ5 2.0 లీటర్ పెట్రోల్ - రూ.43.17 లక్షలు
* ఆడి క్యూ5 2.0 లీటర్ డీజిల్ - రూ.43.47 లక్షలు
* ఆడి క్యూ5 3.0 లీటర్ డీజిల్ - రూ.48.71 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








