ఆగస్ట్‌లో 21 శాతం పెరిగిన ఆడి ఇండియా అమ్మకాలు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఓవైపు ప్యాసింజర్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుంటే, లగ్జరీ కార్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. గడచిన నెలలో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా 20.25 శాతం అమ్మకాల వృద్ధి సాధించింది. ఆగస్ట్ 2012లో 726 కార్లను విక్రయించిన ఆడి ఇండియా, ఆగస్ట్ 2013లో 875 కార్లను విక్రయించింది.
మొత్తమ్మీద ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ నెల వరకు అమ్మకాలను గమనిస్తే, వీటి సంఖ్య 6,426 యూనిట్లుగా ఉంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి ఈ సంఖ్య 5,406 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆడి ఇండియా ఈ ఏడాది మొదటి 8 నెలల్లో ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచిందని, ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో కూడా ఇదే రకమైన వృద్ధిని కొనసాగించగలమని ఆడి ఇండియా విభాగానికి హెడ్‌గా తాజాగా నియమితులైన జో కింగ్ తెలిపారు. ప్రస్తుతం తాము అందిస్తున్న ఉత్పత్తులు, సమర్థవంతమైన నెట్‌వర్క్‌లతో తమ లక్ష్యాలను అధిగమించగలని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆగస్ట్ 2013 నెలలో ఆడి ఇండియా ఓ చవక రకం క్యూ3 ఎస్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, దేశంలోని ఆడి యజమానుల కోసం ప్రత్యేకంగా ఆడి క్లబ్ ఇండియాను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇదే నెలలో న్యూఢిల్లీలో ఆడి ఢిల్లీ సెంట్రల్ షోరూమ్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇటీవలే మరింత శక్తివంతమైన ఏ4 సెడాన్‌ను కంపెనీ విడుదల చేసింది. మారుతున్న మార్కెట్ ట్రెండ్‌ను ఎప్పటికప్పుడు క్యాచ్ చేసుకుంటూ తన అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు ఆడి సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








