2012 అమ్మకాల లక్ష్యాన్ని అధిగమించిన ఆడి ఇండియా

గడచిన 2011లో ఆడి ఇండియా కేవలం 5511 కార్లను మాత్రమే విక్రయిచినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో 2012 అమ్మకాల్లో 63 శాతం ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేసుకొని తమ అమ్మకాల లక్ష్యాన్ని అధిగమించడం సంతోషంగా ఉందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. 2012 సంవత్సరం ప్రారంభంలో ఆడి ఇండియా దేశీయ మార్కెట్లో మొత్తం 8000 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, నవంబర్ 2012 నాటికే కంపెనీ ఈ లక్ష్యాన్ని అధిగమించేసి 8,600 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.
కంపెనీ ప్రవేశపెట్టిన సరికొత్త ఏడి ఏ4, ఆడి క్యూ3, స్థానికంగా అసెంబ్లింగ్‌ను ప్రారంభించిన ఆడి క్యూ7, ఆడి క్యూ5, ఆడి ఏ6 వంటి కార్లు ఎక్కువగా అమ్ముడుపోయి కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. గతేడాదిలో ఆడి ఇండియా ఐదు కొత్త మోడళ్లను (ఆడి టిటి, సరికొత్త ఆడి ఏ4, ఆడి క్యూ3, ఆడి ఎస్4, ఆడి ఏ8ఎల్ 4.2 టిడిఐ) దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








