ఆడి ఇండియా హెడ్‌గా జో కింగ్, ప్రెస్కీ జర్మనీకి

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఏజికు చెందిన వంద శాతం పూర్తి భారతీయ అనుబంధ సంస్థ 'ఆడి ఇండియా' ఉన్నత యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడి ఇండియాకు ఇప్పటి వరకూ హెడ్‌గా వ్యవహరించిన మైఖేల్ ప్రెస్కీ ఇప్పుడు తిరిగి జర్మనీకి వెళ్లిపోనున్నారు.

మైఖేల్ ప్రెస్కీ స్థానాన్ని జో కింగ్ భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 1, 2013వ తేదీ నుంచి జో కింగ్ ఆడి ఇండియా హెడ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మైఖే ప్రెస్కీ అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఏజికు చెందిన నెట్‌వర్క్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌కు హెడ్‌గా నియమితులయ్యారు.

యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్స్ నుంచి పట్టభద్రుడైన జో కింగ్‌కు ఆటోమోటివ్ రంగంలో 23 ఏళ్లకు పైగా అనుభం ఉంది. 1990లో ఈయన టొయోటాలో తన కెరీర్‌ను ప్రారంభించారు. మాస్ మార్కెట్ అలాగే ప్రీమియం మార్కెట్లలో ఇతని అపారమైన అనుభవం ఉంది.


ఇప్పటి వరకు ఆడి ఆస్ట్రేలియాలో విభాగంలో పనిచేసిన జో కింగ్ ఇప్పుడు ఆడి ఇండియా బాధ్యతలు తన భుజంపై వేసుకున్నారు. మైఖేల్ ప్రెస్కీ ఆధ్వర్యంలో ఆడి ఇండియా కొత్త ఎత్తులకు ఎదిగనట్లుగానే, జో కింగ్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

టొయోటాలో కెరీర్‌ను ప్రారంభించిన జో కింగ్, ఆ తర్వాత బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఆస్ట్రేలియాలో 1996 నుంచి 2009 మధ్య కాలంలో వివిధ హోదాల్లో పనిచేశారు. బిఎమ్‌డబ్ల్యూ సిడ్నీ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గాను, జనరల్ మేనేజర్ (సేల్స్) గాను బాధ్యతలు నిర్వహించారు.

Perschke

జులై 2010లో భారత్‌కు వచ్చిన మైఖేల్ ప్రెస్కీ, ఆడి ఇండియా సక్సెస్ స్టోరీలో కీలక పాత్ర పోషించారు. 2010లో సంవత్సరానికి 3003 కార్లను విక్రయించే ఆడి ఇండియా, 2012 నాటికి సంవత్సరానికి 9003 కార్లను విక్రయించే సంస్థగా మార్చడంలో ప్రెస్కీ పాత్ర ప్రశంసనీయమైనది. ప్రెస్కీ ఆధ్వర్యంలో ఆడి భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 27, 2013, 17:50 [IST]
English summary
Joe King has been appointed as the Head of Audi India, effective September 1st, 2013. He takes over from Michael Perschke who will move as Head of Network Strategy and Business Management, international level, at AUDI AG.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+