చవక క్యూ3 క్రాసోవర్‌ను విడుదల చేయనున్న ఆడి

By Ravi

భారత లగ్జరీ కార్ మార్కెట్లో తక్కువ ధర కలిగిన కాంపాక్ట్ లగ్జరీ కార్లకు గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీలు తక్కువ ధర కలిగిన తమ కాంపాక్ట్ కార్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. తాజాగా మెర్సిడెస్ బెంజ్ ప్రవేశపెట్టిన ఏ-క్లాస్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. మరోవైపు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ 1-సిరీస్ కాంపాక్ట్ కారును మరికొద్ది రోజుల్లోనే విపణిలో విడుదల చేయనుంది.

ఈ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఆడి ఇండియా కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఆడి క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ కారులో తక్కువ ధర కలిగిన ఓ వేరియంట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. వచ్చే నెలలో ఇది మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా రానున్న కొత్త ఆడి క్యూ3, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న క్యూ3 కన్నా రూ.3 లక్షలు తక్కువ ధర కలిగి ఉండొచ్చని అంచనా.

ఇంజన్ విషయానికి వస్తే, 2.0 లీటర్ ఇంజన్‌ను ట్యూన్ చేసి పవర్‌ను 140 బిహెచ్‌పి లకు, టార్క్‌ను 320 ఎన్ఎమ్‌లకు కుదించనున్నారు. ఇందులో క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉండనుంది. అయితే, 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ స్థానంలో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఆఫర్ చేయనున్నారు. ఈ ఎంట్రీ లెవల్ ఆడి క్యూ3 క్రాసోవర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Audi Q3

More from DriveSpark

Article Published On: Tuesday, June 25, 2013, 16:13 [IST]
English summary
Audi India is planning to launch a new Sport variant in Q3 portfolio. This variant is the new entry level Q3 crossover and it will launch next month and it will be around Rs. 3 lakh cheaper than the current price range. Stay tuned to telugu.drivespark.com for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+