భారత్‌లో ఏడాది పూర్తి చేసుకున్న ఆడి క్యూ3 ఎస్‌యూవీ

By Ravi

జర్మనీ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీ/క్రాసోవర్‌ 'ఆడి క్యూ3' (Audi Q3) దేశీయ విపణిలో విడుదలై అప్పుడు ఏడాది పూర్తయింది. గడచిన సంవత్సరం జూన్ నెలలో ఆడి ఇండియా ఈ బుజ్జి ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇటు సెడాన్‌లోని సౌకర్యాలను అటు ఎస్‌యూవీలోని పెర్ఫామెన్స్‌ల కలయికే ఈ ఆడి క్యూ3.

ఆడి క్యూ3 ఎస్‌యూవీని తొలిసారిగా గడచిన సంవత్సరం ఢిల్లీలో జరిగిన 2012 అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలో ఆవిష్కరించడం జరిగింది. అప్పటి నుంచే అశేష ప్రజాదరణను సొంతం చేసుకున్న ఆడి క్యూ3, మార్కెట్లో విడుదలై కొత్తల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. జూన్ 2012లో కేవలం రూ. 26.71 లక్షల ప్రారంభ ధరకే ఆడి క్యూ3 మార్కెట్లో విడుదలైంది. ఇప్పటి వరకు ఆడి ఇండియా 1850 యూనిట్లకు పైగా ఆడి క్యూ3 ఎస్‌యూవీలను విక్రయించింది.

ఆడి క్యూ3 భారత్‌లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న లగ్జరీ ఎస్‌యూవీగా కూడా నిలిచింది. ఈ సందర్భంగా భారత్‌లో ఆడి క్యూ3 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఈ ఎస్‌యూవీపై ఓ ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్లో భాగంగా 100 ఆడి క్యూ3 ఎస్‌యూవీలపై మాత్రమే కంపెనీ ఫైనాన్స్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ ఫైనాన్స్ స్కీమ్‌లో ఆడి క్యూ3 ఎస్‌యూవీని కొనుగోలు చేసే వారు రూ.6 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.35,400 చొప్పున సులభ వాయిదాలలో చెల్లించవచ్చు.

Audi Q3

ఆడి భారత మార్కెట్లో అందిస్తున్న అన్ని మోడళ్లపై వివిధ ఆకర్షనీయమైన ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తోంది. ఆడి క్యూ3 పెట్రోల్ (2.0 లీటర్ ఎస్ఎఫ్ఐ) మరియు డీజిల్ (2.0 లీటర్ టిడిఐ) ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో ఆడి క్యూ3 ప్రారంభ ధర రూ.28.08 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంది.

ఆడి ఏ4, ఆడి ఏ6, స్పెషల్ ఎడిషన్ ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ3, కొత్త ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఎస్4, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి కూపే, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, కొత్త ఆడి ఆర్8 స్పైడర్ మరియు ఆడి ఆర్8 వి10 ప్లస్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 3, 2013, 15:19 [IST]
English summary
Audi, the German luxury car manufacturer celebrated the anniversary of one of its most popular SUVs - Audi Q3 with an innovative and special finance offer on the first 100 units to be booked starting today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+