అగ్గిలో భుగ్గి అయిన ఆడి ఆర్8 సూపర్ కారు
కేవలం చవక కార్లు మాత్రమే కాదు ఖరీదైన లగ్జరీ కార్లు కూడా అగ్నికి ఆహుతవుతాయని ముంబైలో జరిగిన తాజా సంఘటన నిరూపించింది. ముంబైలోని బాంద్రా-వోర్లీ సీ లింక్‌పై ఓ ఆడి ఆర్8 లగ్జరీ కారులో ఉన్నట్టుండి మంటులు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చే లోపే కారు పూర్తిగా కాలి బూడిందైంది. ముంబైలో పార్క్స్ సూపర్‌కార్ పెరేడ్ 2013 జరుగుతుండగా ఈ సంఘటన జరగటం గమనార్హం. అయితే, మంటల్లో కాలిపోయిన ఆడి ఆర్8 కారు మాత్రం ఈ పార్క్స్ సూపర్‌కార్ పెరేడ్ 2013కు సంబంధించినది కాదు.
కాగా.. ఈ కారు అగ్ని ప్రమాదంలో, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాధమిక విచారణ ప్రకారం, కారులో ఆఫ్టర్‌మార్కెట్ మోడిఫికేషన్స్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆడి ఆర్8 వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కార్లను మోడిఫై చేయటానికి నిపుణులైన టెక్నీషియన్లు అవసరం.
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇటీవలే ఈ లేటెస్ట్ స్పోర్ట్స్ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా విడుదలైన బాలీవుడ్ చిత్రం రేస్2లో కూడా ఈ మోడల్ కార్లను గమనించవచ్చు. భారత మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ.1.8 కోట్లకు పైమాటే. కాగా.. ఆడి ఇండియా కేసును ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఇది కంపెనీ పేరు ప్రతిష్టలకు, ఉత్పత్తి నాణ్యతకు సంబంధించిన విషయం కావడంతో నేరుగా ఉన్నతాధికారులే ఈ అంశాన్ని వ్యక్తిగతం పరిశీలిస్తున్నారు. త్వరలోనే కంపెనీ దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

అగ్గిలో భుగ్గి అయిన ఆడి ఆర్8 సూపర్ కారు

అగ్గిలో భుగ్గి అయిన ఆడి ఆర్8 సూపర్ కారు

అగ్గిలో భుగ్గి అయిన ఆడి ఆర్8 సూపర్ కారు

అగ్గిలో భుగ్గి అయిన ఆడి ఆర్8 సూపర్ కారు



Click it and Unblock the Notifications








