జులై 12న విడుదల కానున్న ఆడి ఎస్6 స్పోర్ట్స్ కార్

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా మరో సరికొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆర్ఎస్5 కూపే స్పోర్ట్స్ కారును విడుదల చేసిన ఆడి ఇండియా, ఇప్పుడు తాజాగా ఆడి ఎస్6 స్పోర్ట్స్ కారును విడుదల చేయనుంది. జులై 12, 2013న ఈ కొత్త కారును విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

ఆడి ఇండియా ఇప్పటికే తమ అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలో కొత్త ఆడి ఎస్6కు సంబంధించిన టీజర్ ఫొటోలను విడుదల చేస్తోంది. కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ ఆడి ఏ6కు స్పోర్టీ వెర్షనే ఈ ఆడి ఎస్6 అని చెప్పవచ్చు. ఈ కారులో అదే 4.0 లీటర్ వి8 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 420 బిహెచ్‌‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆడి ఎస్6 కేవంల 4.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇంతటి స్పోర్టీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉన్నప్పటికీ ఇది మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంటుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉపయోగించిన సిలిండర్ ఆన్ డిమాండ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో కారు లోడ్ కండిషన్‌ను బట్టి ఇది ఫోర్-సిలిండర్ ఇంజన్ మాదిరిగా పనిచేసి, తక్కువగా ఇంధనాన్ని గ్రహిస్తుంది.

ఈ కారులో కూడా పాపులర్ 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించనున్నారు. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యం కానున్న సరికొత్త ఆడి ఎస్6కు సంబంధించి మరిన్న లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Audi Car

More from DriveSpark

Article Published On: Tuesday, July 9, 2013, 17:47 [IST]
English summary
Audi India has announced that, it will launch the Audi S6 in India on 12th of July. The Audi S6 gets power from a 4 litre TFSI V8 petrol engine that offers 420 PS power and 550 Nm torque.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+