భారత్‌లో ఆడి క్యూ3 ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభం!

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీని ఇప్పుడు స్థానికంగానే ఉత్పత్తి చేస్తోంది. ఔరంగాబాద్‌లో ఉన్న తమ ప్లాంటులో ఆడి క్యూ3 లోకల్ ప్రొడక్షన్‌ను ప్రారంభించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆడి ఇండియా ఇప్పటికే దేశీయంగా ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ5, ఆడి క్యూ7 మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది.

కాగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆడి క్యూ3 వచ్చి చేరడంతో, ఆడి ఇండియా స్థానికంగా భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న మోడళ్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఔరంగాబాద్‌లోని తమ తమ గ్రూప్ ప్లాంట్ స్కొడా ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఏఐపిఎల్)లో కొత్తగా 20,000 చ.మీ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ కేంద్రంలో క్యూ3ని అసెంబ్లింగ్ చేయనున్నారు. ఇదే ఫ్లోర్‌పై ఆడి క్యూ7ను కూడా అసెంబ్లింగ్ చేస్తున్నారు.

Audi Q3

ఆడి క్యూ3 సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా ఇండియాకు దిగుమతి చేసుకొని, సదరు విడిభాగాలను భారత్‌లోని ఔరంగాబాద్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తారు. భారత మార్కెట్లో ఆడి క్యూ3, ఆడి క్యూ5, ఆడి క్యూ7 మోడళ్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, అందుకే ఈ మోడళ్లను స్థానికంగా ఉత్పత్తి చేసి వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది.

కాగా.. ఆడి క్యూ3ని స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో, దేశీయ విపణిలో దీని ధర మరింత దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే కంపెనీ అమ్మకాలు 19 శాతం వృద్ధి చెంది 6426 యూనిట్లుగా నమోయదయ్యాయని, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (జనవరి-ఆగస్ట్ 2012) ఇవి 5406 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 19, 2013, 17:12 [IST]
English summary
Audi has started production of the Q3 compact-class SUV at its Aurangabad plant, in the Indian state of Maharashtra. After the Audi A4, Audi A6, Audi Q5 and Audi Q7, the Audi Q3 is the fifth model to be produced in India by the Ingolstadt carmaker.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+