మార్చి 31 వరకూ ఎక్స్ రేంజ్ ఎస్‌యూవీల ధరలు పెంచం: బిఎమ్‌డబ్ల్యూ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన యూనియన్ బడ్జెట్ 2013-14లో పెద్ద ఎస్‌యూవీలపై ఎక్సైజ్ సుంఖాన్ని 27 శాతం నుంచి 30 శాతానికి అలాగే, ఇంపోర్టెడ్ లగ్జరీ కార్లపై దిగుమతి సుంఖాన్ని 75 శాతం నుంచి 100 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశీయ, విదేశీయ కంపెనీలు తమ ఎస్‌యూవీలు, ఇంపోర్టె కార్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే, జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా మాత్రం, ఈ నెలాఖరు వరకూ ఎస్‌యూవీలు, ఇంపోర్టెడ్ కార్ల ధరలను పెంచబోమని పేర్కొంది. మార్చి 31, 2013 వరకూ బడ్జెట్‌కు ముందున్న ధరలకే తమ ఉత్పత్తులు అందిస్తామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎస్‌యూవీలను ప్రీ-బడ్జెట్ (బడ్జెట్ ముందు) ధరలకే అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ సిరీస్ మోడళ్లలో బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ వంటి బిఎమ్‌డబ్ల్యూ ఎఫీషియంట్ డైనమిక్స్ ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ మోడళ్లు అద్భుతమైన పెర్ఫామెన్స్‌ను డెలివరీ చేయటమే కాకుండా ఆకట్టుకునే మైలేజీని కూడా అందిస్తాయి. కంపెనీ అందిస్తున్న స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో బిఎమ్‌డబ్ల్యూ అధీకృత డీలరును సంప్రదించండి.



Click it and Unblock the Notifications








