నిస్సాన్ సన్నీ ఇప్పుడు రూ.5.79 లక్షలు మాత్రమే!

By Ravi

Nissan Sunny
జపానీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ భారత మార్కెట్లో అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ మిడ్-సైజ్ సెడాన్ 'నిస్సాన్ సన్నీ' ఇప్పుడు నమ్మసక్యం కాని ధరకే లభిస్తోంది. పరిమితం కాలం ఆఫర్‌గా నిస్సాన్ తమ సన్నీ సెడాన్‌ను కేవలం రూ.5.79 లక్షలకే కంపెనీ అందిస్తోంది (పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర). నిస్సాన్ సన్నీ సాధారణ ప్రారంభ ధర రూ.5.95 లక్షలు (ఎక్సఈ పెట్రోల్ వేరియంట్, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర)గా ఉంది. అయితే, ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని నిస్సాన్ ఆకర్షనీయమైన ధరకే తమ బెస్ట్ సెల్లింగ్ కారును ఆఫర్ చేస్తోంది.

తక్కువ ధరలో సౌకర్యవంతమైన సదుపాయాలను అందించే నిస్సాన్ సన్నీ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఐదు వేరియంట్లలో (3 పెట్రోల్, 2 డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది) పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ సన్నీలో 1498సీసీ, డిఓహెచ్‌సి 16 వాల్వ్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 99 పిఎస్‌‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే ఈ కారు ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటరుకు 16.95 కి. మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఇకపోతే, డీజిల్ వెర్షన్ నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించిన అధునాతన 1.5-లీటర్, 4-సిలిండర్ కె9కె ఇంజన్ 3750 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరు డీజిల్‌కు 21.64 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. నిస్సాన్ సన్నీ ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటీ వంటి మిడ్-సెజ్ సెడాన్‌లకు పోటీగా నిలుస్తోంది.

ఇందులో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా లభిస్తాయి. వివిధ వేరియంట్లలో లభించే నిస్సాన్ సన్నీ సెడాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

* నిస్సాన్ సన్నీ ఎక్స్ఈ (పెట్రోల్) - రూ.5.95 లక్షలు
* నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ (పెట్రోల్) - రూ.7.07 లక్షలు
* నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (పెట్రోల్) - రూ.7.88 లక్షలు
* నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ (డీజిల్) - రూ.8.14 లక్షలు
* నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (డీజిల్) - రూ.8.95 లక్షలు

More from DriveSpark

Article Published On: Wednesday, January 16, 2013, 15:27 [IST]
English summary
Japanese carmaker Nissan India is offering its flagship sedan Sunny at Rs. 5.79 Lacs only. Company stated that it is limited period offer. So Hurry, to grab limited period offer today and own Nissan Sunny.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+