ఏడాది చివరి కల్లా విడుదల కానున్న బజాజ్ ఆర్ఈ60

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో గడచిన సంవత్సరం జనవరి నెలలో ఆవిష్కరించిన నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనం (క్వాడ్రిసైకిల్) 'బజాజ్ ఆర్‌ఈ60' (Bajaj RE60)ను ఈ ఏడాదే మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న సాంప్రదాయ ఆటోరిక్షాలకు ప్రత్యామ్నాయంగా, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతని కల్పించేందుకు గాను ఈ ఆర్ఈ60ని అభివృద్ధి చేశామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇవి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతానికి ఇందులో కమర్షియల్ వెర్షన్లు మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేయనుంది. పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ కోసం కంపెనీ ఆవిష్కరించిన ఆర్ఈ60 ఉత్పత్తి రూపం దాల్చకపోవచ్చని తెలుస్తోంది. కాగా.. బజాజ్ ఆర్ఈ60 కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే కాకుండా, సీఎన్‌జీ మరియు ఎల్‌పీజీ వెర్షన్లలో కూడా విడుదల చేస్తామని, సీఎన్‌జీ వెర్షన్ కేజీకి 35-37 కి.మీ. మైలేజీని, ఎల్‌పీజీ వెర్షన్ లీటరుకు 30 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో బజాజ్ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్ ధర సుమారు రూ.1.5 లక్షలు రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Bajaj RE60

ఇదిలా ఉండగా, బజాజ్ ఆటో గడచిన నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన కాంపాక్ట్ ఆటోరిక్షాలను ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. డీజిల్ ఇంధనంతో నడిచే బజాజ్ ఆర్ఈ కాంపాక్ట్ ఆటోరిక్షాలను త్వరలోనే ప్రవేశపెడతామని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. బజాజ్ తాజాగా విడుదల చేసిన ఈ ఆర్ఈ కాంపాక్ట్ ఆటోరిక్షాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్యాసింజర్ వాహనాల కన్నా అనేక రెట్లు మెరుగైనవి. ఇందులో 4-స్ట్రోక్ డిటిఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు.

స్టయిలిష్ ఫ్రంట్ లుక్, సులువైన సర్వీసింగ్ మరియు రిపేర్ టెక్నాలజీలు, సాటిలేని పెర్ఫామెన్స్, తిరుగులేని మైలేజ్, ధృఢమైన నిర్మాణం వంటి కొత్త శ్రేణి ఫీచర్లతో ఈ కాంపాక్ట్ ఆటోరిక్షాను అభివృద్ధి చేశామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం బజాజ్ ఆటో అందిస్తున్న త్రిచక్ర వాహనాల కన్నా ఇవి 10-15 శాతం ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తాయని, తక్కువ మెయింటినెన్స్ ఖర్చుతో ఎక్కువ రాబడి అందిస్తాయని బజాజ్ ఆటో తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, July 5, 2013, 17:06 [IST]
English summary
Bajaj Auto, the world's largest three-wheeler maker, expects to launch its four-wheeled passenger carrier RE60 by end of the current financial year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+