నిస్సాన్ మైక్రా డీజిల్‌పై లక్ష రూపాయల డిస్కౌంట్!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు మైక్రాలో డీజిల్ వెర్షన్‌పై ఇప్పుడు భారీ తగ్గింపు లభిస్తోంది. నిస్సాన్ మైక్రా డీజిల్ మార్కెట్లో విడుదైలనప్పటి నుండి దీని అధిక ధరక కారణంగా ఈ వేరియంట్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు ఈ నేపథ్యంలో, డీజిల్ వెర్షన్ మైక్రా అమ్మకాలను పెంచుకునేందుకు బెంగుళూరుకు చెందిన నిస్సాన్ ఇండియా అధీకృత డీలర్ షావర్ నిస్సాన్ ఈ కారుపై ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది.

నిస్సాన్ మైక్రా డీజిల్‌పై షావర్ నిస్సాన్ అందిస్తున్న లక్ష రూపాయల తగ్గింపులో రూ.50,000 నగదు డిస్కౌంట్‌ మరియు రూ.50,000 ఎక్సేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. ప్రస్తుతం నిస్సాన్ మైక్రా డీజిల్ రెండు వేరియంట్లలో (ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం) లభ్యమవుతుంది. మైక్రా ఎక్స్‌వి డీజిల్ ధర రూ.7.51 లక్షలుగా ఉండగా, మైక్రా ఎక్స్‌వి ప్రీమియం డీజిల్ ధర రూ.8.06 లక్షలుగా ఉంది (రెండు ధరలు ఆన్-రోడ్ బెంగుళూరు). లక్ష రూపాయల తగ్గింపు అనంతరం ఇవి వరుసగా రూ.6.51 లక్షలు, రూ.7.06 లక్షలకే లభ్యం కానున్నాయి.

డీజిల్ వేరియంట్‌ నిస్సాన్ మైక్రాలో 1.5 లీటర్, ఎస్ఓహెచ్‌సి, 8-వాల్వ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 23.08 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. నిస్సాన్ మైక్రా కేవలం 4.6 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి చిన్న రోడ్లపై సైతం సౌకర్యవంతంగా డ్రైవ్ చేసేందుకు సహకరిస్తుంది. ఇందులో పవర్ స్టీరింగ్, స్టీరింగ్ టిల్ట్ అడ్జస్టమెంట్, పవర్ విండోస్, సెంట్రల్ డోర్ లాంక్, పుష్ బటన్ స్టార్ట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Nissan Micra

More from DriveSpark

Article Published On: Monday, May 13, 2013, 16:59 [IST]
English summary
Bangalore based Nissan India official dealer Shahawar Nissan is offering INR 1 lakh discount on the Nissan Micra Diesel hatchback. This discount includes INR 50,000 as cash discount and INR 50,000 as exchange bonus.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+