ర్యాష్ బస్ డ్రైవర్ల చేతుల్లో బలవుతున్న అమాయకులు

అనేక రోడ్డు ప్రమాదాలకు మితిమీర వేగమే ప్రధాన కారణం అవుతుంటుంది. తాజాగా.. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌‌కు వస్తున్న ఓ వోల్వో బస్సు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద మంగంళవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతైంది. ఇందులో సుమారు 45 మందికి అక్కడికక్కడే మంటల్లో కాలి బుడిదైపోయిన సంఘటన యావత్ రాష్ట్రాన్ని కలచి వేసింది.

ఈ ప్రమాదానికి కూడా మితిమీరిన వేగమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. సాధారణ సూపర్ లగ్జరీ బస్సులతో పోల్చుకుంటే వోల్వో, మెర్సిడెస్ బెంజ్, ఇసుజు వంటి ఆల్ట్రా లగ్జరీ బస్సులలో ప్రయాణ వ్యవధి చాలా తక్కువగా ఉంటుందని అనేక మంది ఈ బస్సులకు ఈ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ బస్సులలో ప్రయాణం ఎంత సౌకర్యవతంగా ఉంటుందో, అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది.

Bus Catches Fire

లక్షలు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇలాంటి విలాసవంతమైన బస్సులలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు కనీస రక్షణ సదుపాయాలు లేకపోవటం గమనార్హం. ఇలాంటి బస్సులలో తగినన్ని అత్యవసర ద్వారాలను, అగ్నిమాపక యంత్రాలను అమర్చాలి. బస్సు ప్రయాణం ప్రారంభం కావటానికి ముందే వీటిని ఎలా ఉపయోగించాలో (లైవ్‌గా లేదా వీడియో) ద్వారా ప్రయాణికులకు వివరించాలి.

ఇలాంటి బస్సులకు స్పీడ్ లిమిట్‌ను ఫిక్స్ చేయాలి. ట్రాఫిక్ అధికారులు తరచూ ఇలాంటి బస్సులను తనిఖీ చేయాలి. ఏవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, వాళ్లు ఎంత పెద్దవాళ్లయిన సరే కఠినంగా శిక్షించాలి. నిబంధనలు పాటించని ట్రావెల్ ఏజెన్సీలను నిషేధించాలి.

ఈ బస్సులు నడిపే డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా గంటకు 125-150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టిస్తుంటారు. అంతేకాదు, ఈ బస్సులను నడిపే డ్రైవర్లు రోడ్డుపై ఇలాంటి ఇతర వాహనాలతో పోటీపడి మరి, ఎఫ్1 రేసులో ఫార్ములా వన్ కార్లను పరిగెట్టించినట్లుగా, చాలా ర్యాష్‌గా నడుపుతుంటారు. ఇదిగో ఈ వీడియోలో చూడండి వోల్వో బస్సులు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ గంటకు 125 కిలోమీటర్లకు మించిన వేగంతో ఎలా ముందుకు సాగిపోతున్నాయో..!
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/_hu-iCl3v0U?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

More from DriveSpark

Article Published On: Wednesday, October 30, 2013, 15:05 [IST]
English summary
Coming to Hyderabad? If yes, Jabbar travels might not be your best option. We look into the drama which has killed 44 passengers, who boarded Jabbar travels bus from Bangalore to Hyderabad.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+