వాహనాలకు సన్ షేడ్ ప్యాడ్‌లు వాడితే భారీ జరిమానా

By Ravi

Sun Shade Pads
వాహనాల అద్దాలను క్లియర్‌గా ఉంచమని సుప్రీం కోర్టు ఎన్నిసార్లు నెత్తినోరు బాదుకొని చెబుతున్నప్పటికీ, వాహన చాలకులు మాత్రం ఆ విషయాన్ని పెడ చెవిన పెట్టేసి, మాకేముందిలే అంటూ వెళ్లిపోతున్నారు. కొందరు తెలివిమీరిన డ్రైవర్లు మాత్రం తమ వాహనాలకు సన్‌ఫిల్ములను తొలగించేసి, వాటి స్థానంలో సన్ షేడ్ ప్యాడ్లు, కర్టెన్లు వంటి నల్లటి వస్తువులతో కార్ల అద్దాలను కప్పేస్తున్నారు. అదేమని అడిగితే, మమ్మల్ని సన్‌ ఫిల్ములు ఉపయోగించవద్దన్నారు కానీ, ప్రత్యామ్నాయాలను వాడుకోవద్దని చెప్పలేదు కదా అని తెలివిగా సమాధానమిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని వాహనలకు సన్ ఫిల్ముల వాడకంపై నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చిన తర్వాత వాహన చాలకులు ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సన్ షేడ్ ప్యాడ్ (సూర్యకాంతి వాహనం లోపలికి ప్రవేశించకుండా ఉండేలా అద్దాలకు లోపలి వైపు నుంచి అంటించే నల్లటి ప్యాడ్‌లు) వ్యాపారం జోరందుకుంది. రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎక్కడపడితే అక్కడ వీటిని విక్రయిస్తున్నారు. కేవలం రూ.100 లకే ఇవి లభ్యమవుతుండటంతో అనేక మంది డ్రైవర్లు వీటిని కొనుగోలు చేసిన తమ వాహనాల్లో ఉపయోగించేస్తున్నారు.

కానీ.. వీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుప్రీం కోర్డు ఆదేశాల ప్రకారం వాహనంలోని వ్యక్తులు, వస్తువులు, వాహనంలో చోటు చేసుకునే సంఘటనలు బయటి వారికి కనిపించేలా ఫ్రంట్ అండ్ రియర్ విండ్‌స్క్రీన్స్‌లు 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి. ఈ నిబంధనకు వ్యతిరేఖంగా, ఈ విజబిలిటీని తగ్గించేలా అద్దాలకు ఎలాంటి వస్తువులు/పదార్థాలు ఉపయోగించినా అది చట్ట వ్యతిరేఖమే అవుతుంది.

ఇటీవల ఢిల్లీలో ఓ ప్రైవేట్ సిటీ బస్సులో జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనలో కూడా సదరు బస్సుకు నల్లటి ఫిల్ములు ఉపయోగించి ఉండటం వలన అందులో జరిగిన అరాచకం బయటి ప్రపంచానికి కనిపించకుండా పోయింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అల్టమస్ కబీర్ కూడా వ్యక్తం చేశారు. తాము చెప్పినట్లు సన్ ఫిల్ముల నిబంధను పాటించి ఉంటే, ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని ఆయన అన్నారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో, నగరంలో ఇప్పుడు సన్ ఫిల్ముల నిషేధంపై ట్రాఫిక్ పోలీసులు తీవ్రస్థాయిలో డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 8, 2013, 18:37 [IST]
English summary
Car users are using sun shades to keep themselves cool while driving. But most do not know its illegal. Police are now taking a fine of Rs.1,000 form people using sun shades while the cost of these pads starts from Rs.100.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+