చెన్నై ప్లాంటులో బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఉత్పత్తి ప్రారంభం
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్'ను స్థానికంగా చెన్నై ప్లాంటులో ఉత్పత్తి చేసే ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. చెన్నైకు సమీపంలో ఉన్న మహీంద్రా వరల్డ్ సిటీలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్లాంటులో కంపెనీ అసెంబ్లింగ్ చేసిన మొదటి 7-సిరీస్ లగ్జరీ కారును కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాబెర్ట్ ఫ్రిట్రాంగ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతానికి ఈ ప్లాంటులో డీజిల్ వేరియంట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పెట్రోల్ వేరియంట్లును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుంటున్నారు.
బిఎమ్‌డబ్ల్యూ ఈ అప్‌గ్రేడెడ్ 7-సిరీస్ లగ్జరీ కారును ఏప్రిల్ 25, 2013 భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ధరలు రూ.92.90 లక్షల నుంచి రూ.1.73 కోట్ల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). దేశీయ విపణిలో 2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వాటి వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి - రూ. 92.90 లక్షలు
- బిఎమ్‌డబ్ల్యూ 740ఎల్‌ఐ - రూ. 1.12 కోట్లు
- బిఎమ్‌డబ్ల్యూ 750ఎల్‌ఐ - రూ. 1.29 కోట్లు
- బిఎమ్‌డబ్ల్యూ 760ఎల్‌ఐ - రూ. 1.73 కోట్లు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)

అప్‌గ్రేడెడ్ బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారులో రివైజ్డ్ ఫ్రంట్ డిజైన్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, మరింత అప్‌రైట్ కిడ్నీ గ్రిల్, ఫుల్ అడాప్టివ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, బూట్‌లిడ్‌పై క్రోమ్ స్ట్రిప్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్లను కూడా అప్‌డేట్ చేయటం జరిగింది. ఈ కొత్త వేరియంట్లలో ఇది వరకటి ఇంజన్లనే రీట్యూన్ చేసి ఉపయోగించారు.
ఈ ఇంజన్ల సామర్థ్యాలలో స్వల్పంగా మార్పులు ఉన్నాయి. 2013 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ డీజిల్ ఇంజన్ సామర్థ్యాన్ని స్వల్పంగా పెంచగా, పెట్రోల్ వెర్షన్ మైలేజీని 21 శాతం మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (8 ఆటోమేటిక్ గేర్లు)తో లభిస్తాయి.


Click it and Unblock the Notifications








