డిసి లాంజ్ ఎక్స్ఎల్ - కస్టమైజ్డ్ మినీ బస్

'గృహమే కదా స్వర్గసీమ' అన్నారు పెద్దలు. అయితే డిసి డిజైన్స్ వాళ్లు మాత్రం 'వాహనమే కదా స్వర్గసీమ' అంటున్నారు. ఆటోమొబైల్ వాహనాలను విలాసవతంమైన వాహనాలుగా కస్టమైజ్ చేయడంలో దిలీప్ చాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ సంస్థకు పెట్టింది పేరు. కార్లు, ఎస్‌యూవీలు, చిన్న పాటి బస్సులు మొదలకొని మల్టీ యాక్సిల్ లగ్జరీ బస్సుల వరకూ అన్నింటినీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, అందంగా, ఆకర్షనీయంగా, విలాసవంతంగా తీర్చిదిద్దేస్తారు డిసి డిజైన్స్ వారు.

ఆటోమోటివ్ కస్టమైజేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దిలీప్ చాబ్రియా తమ డిసి డిజైన్స్ సంస్థలను దేశంలోని పలు ప్రధాన నగరాలకు విస్తరించారు. సామాన్యులకు మొదలుక సెలబ్రిటీల వరకూ డిసి డిజైన్స్ వాహనాలను కస్టమైజ్ చేసి అందిస్తుంది. డిసి డిజైన్స్ తాజాగా ఓ మినీ బస్సును అత్యంత విలావంతమైన ఇంటీరియర్లతో కస్టమైజ్ చేసింది. జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ ఇసుజు అందిస్తున్న 'ఇసుజు 4500' ఛాస్సిస్‌ను ఆధారంగా చేసుకొని డిసి డిజైన్స్ ఈ మినీ బస్సును కస్టమైజ్ చేసి, దీనికి 'డిసి లాంజ్ ఎక్స్ఎల్' అనే పేరును పెట్టింది.

ప్రస్తుతం డిసి లాంజ్ ఎక్స్ఎల్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా స్వాగతిస్తోంది. ఈ మినీ బస్సును రెండు భాగాలుగా విభజించి, ఓ భాగంలో బెడ్‌రూమ్‌ను మరొక భాగంలో లివింగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్‌లో ఎల్‌సిడి టివిలను ఏర్పాటు చేశారు. లివింగ్ రూమ్‌లో ప్రీమియం లెథర్‌తో చేయబడిన 4 విశాలమైన సీట్లు, సీట్లకు మధ్య భాగంలో ఫోల్డబిల్ టేబుల్‌ ఉంటుది. ఇంకా ఇందులో, టెలిఫోన్ సౌకర్యం, కంటికి ఇంపైన ఇంటీరియర్ లైటింగ్, అటాచ్డ్ రెస్ట్‌ రూమ్‌తో (బాత్రూమ్) కూడిన బెడ్‌రూమ్, ఫుల్లీ ఎయిర్ కండిషన్, స్టోరేజ్ స్పేస్, ప్యాంట్రీ వంటి అనేక విలాస వంతమైన ఫీచర్లతో ఇది స్వర్గాన్ని తలపిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఓ కన్నేస్కోండి..!

More from DriveSpark

Article Published On: Friday, February 1, 2013, 14:55 [IST]
English summary
DC Design, the vehicle customizing company appears to have penchant for building vehicles fit for stars. Soon after unveiling the DC first class super luxury bus, DC Design has revealed images of yet another luxury bus named as the Lounge XL.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+