ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి బుకింగ్స్ ఓపెన్; ఏప్రిల్ 29న విడుదల

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'పోలో'లో ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, కంపెనీ డీలర్లు ఇప్పటికే ఈ కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి' వేరియంట్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి ఈనెల 29న మార్కెట్లో విడుదల కానుంది.

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 1.6 లీటర్ వేరియంట్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండటంతో, సదరు వేరియంట్‌ను రీప్లేస్ చేస్తూ కంపెనీ ఈ 1.2 లీటర్ వేరియంట్‌‌ను ప్రవేశపెట్టనుంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటిలో డైరెక్ట్ ఇంజక్షన్ మరియు టర్బో ఛార్జింగ్ ఆప్షన్‌తో కూడిన 1.2 లీటర్ టిఎస్ఐ (పెట్రోల్), ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని వలన ఇది గరిష్టంగా 105 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Volkswagen Polo

ఈ ఇంజన్‌ను డిక్యూ200 7-స్పీడ్ డిఎస్‌జి ట్రాన్సిమిషన్‌తో జతచేశారు. ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉంది. మిగతా పోలో మోడళ్లతో పోల్చుకుంటే మోడల్‌ను మరింత భిన్నంగా ఉంచేందుకు గాను ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి కోసం పోలో ఎస్ఆర్ ఎడిషన్ బాడీ కిట్‌ను జోడించనున్నారు. రూ.50,000 అడ్వాన్సును స్వీకరించి, బుకింగ్‌లను అంగీకరిస్తున్నారు. మే రెండవ వారం నుంచి ఈ కారు డెలవరీలు ప్రారంభం కావచ్చని అంచనా.

ఈ పోలో జిటి కారుకు ముందు వైపు, వెనుక వైపు అలాగే పక్క భాగాల్లో స్పెషల్ స్కర్ట్స్ ఉండనున్నాయి. ఇంకా రియర్ రూఫ్ స్పాయిలర్, క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఈ కారుకు సంబంధించిన మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 25, 2013, 15:59 [IST]
English summary
German car maker Volkswagen will launch the new Polo GT with 1.2L petrol turbocharged engine in India on 29th April 2013. In this connection, company dealers already accepting bookings for new Volkswagen Polo GT TSI variant. Stay tuned to Drivespark for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+