కార్లలో హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం బిఎస్ఎన్ఎల్ మాడ్యూల్

Car Internet
సాధారణంగా యూస్‌బి డాంగిల్స్‌తో కారులో ప్రయాణిస్తున్న ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయటం అంత సులువు కాదు. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ అంతరాయం కారణంగా ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమస్యకు చెక్ పెడుతూ, భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఓ సరికొత్త పరిష్కారాన్ని కనిపెట్టింది.

కార్లలో అత్యధిక వేగంతో కూడిన అంతర్జాలాన్ని (హై-స్పీడ్ ఇంటర్నెట్)ను ఉపయోగించునేందుకు గాను వై-ఫై టెక్నాలజీ మాడ్యూల్స్‌ను బిఎస్ఎన్ఎల్ ఇండోర్ బ్రాంచ్ పరిచయం చేసింది. వై-ఫై టెక్నాలజీ మాడ్యూల్ ధర రూ.5000 నుంచి రూ.6000 రేంజ్‌లో ఉంటుంది. కారుకు పైభాగాన అమర్చిన యాంటినీ సాయంతో ఇది టెలిఫోన్ ఎక్సేంజ్ నుంచి సిగ్నల్స్‌ను గ్రహించి వై-ఫై రూపంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తుంది.

సిడిఎమ్ఏ టెక్నాలజీ ఆధారంగా చేసుకొని ఈ మాడ్యూల్‌ను తయారు చేశామని బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఇది 3.5 ఎమ్‌బిపిఎస్ వేగంతో వై-ఫై సిగ్నల్స్‌ను గ్రహిస్తుంది. తొలుతగా ఈ సిస్టమ్‌ను బిఎస్ఎన్ఎల్ ఇండోర్ యూనిట్ జనరల్ మేనేజర్ జిసి పాండే కారులో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. బహుశా ఇది భారత్‌లో ఈ తరహా వ్యవస్థ మొట్టమొదటిని పాండే చెప్పారు. ఒక్కసారి ఇది పాపులారిటీని సంపాధించుకున్న తర్వాత వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ మోడల్‌ను ఆదరిస్తారని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, April 5, 2013, 12:16 [IST]
English summary
BSNL's Indore division launched a Wi-Fi technology module for cars which will enable people to use internet while they are travelling. This was probably the first model in the country where the car has an antenna which receives Wi-Fi signals with 3.5Mbps speed, from an exchange based on CDMA technology.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+