బుగాటి సూపర్ వేరాన్ రాదు, కానీ రీప్లేస్‌మెంట్ వస్తుంది

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు 'బుగాటి వేరాన్'లో పవర్‌ఫుల్ వేరియంట్ 'బుగాటి సూపర్ వేరాన్' వస్తుందున్న వార్తలకు తెరపడింది. ఫ్రెంచ్ కార్ కంపెనీ బుగాటి రూపొందించిన మాస్టర్‌పీస్ 'వేరాన్'లో మరింత శక్తివంతమైన వేరియంట్‌కు బదులుగా దీని రీప్లేస్‌మెంట్ మోడల్ రావచ్చని తాజా సమాచారం.

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే రోడ్ లీగల్ సూపర్ కారుగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన 'బుగాటి వేరాన్'కు సక్సెసర్‌గా సూపర్ వేరాన్ వస్తుందని, ఇందులో 1600 హార్స్ పవర్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని, ఇది కేవలం 1.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పుకార్లు వచ్చాయి.


అయితే, ఈ విషయంలో ఆటోబ్లాగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుగాటి ప్రెసిడెంట్ డా. వోల్ఫ్‌గ్యాంగ్ ష్రీబర్ మాట్లాడుతూ.. ఎలాంటి సూపర్ వేరాన్‌ను ప్లాన్ చేయలేదు, నిర్మించలేదు. కానీ అప్పుడే అంతా అయిపోలేదు. వేరాన్ ఉత్పత్తిని కేవలం 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశాం. ఇప్పటి వరకూ 390 యూనిట్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించాం. మిగిలిన 60 యూనిట్లు 2015 నాటికి బుగాటి ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. బుగాటి వేరాన్ ఉత్పత్తి ముగిసిన తర్వాత, దీనికి సక్సెసర్ కాకుండా రీప్లేస్‌మెంట్‌ను నిర్మిస్తామని ఆయన అన్నారు.
Bugatti Super Veyron

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2013, 17:28 [IST]
English summary
If you are enamoured by the Bugatti Veyron like many others you would have closely followed every rumour, minor or major (which keep appearing on a regular basis) about the future of the Veyron, the Guinness record holder of the world's fastest production car title.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+